సొంత అన్నను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..ఇంకెవరు దొరకలేదా తల్లి..?
పాకిస్తాన్ నటి జవేరియా అబ్బాసీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆమె తన పర్సనల్ లైఫ్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేక వివాదాలకు దారితీశాయి. 1997లో, కేవలం 17 ఏళ్ల వయసులో, జవేరియా తన సవతి సోదరుడు షమూన్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. ఈ వివాహంపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయితే, కొంతమంది మాత్రం వారు బయోలాజికల్ సోదరసోదరీమణులు కానందువల్ల ఈ బంధాన్ని సమర్థించారు.
జవేరియా తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సొంత తల్లి అత్తగా మారి తనపై కఠినంగా వ్యవహరించిందని, కానీ సమాజం కోసం మంచి కోడలిగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. అయితే, సమాజం వారిని చూస్తున్న తీరు, వారిపై వస్తున్న విమర్శలు తట్టుకోలేక ఒత్తిడికి గురై షమూన్‌తో విడాకులు తీసుకుంది. అప్పటికే వారికి అంజెలా అనే కుమార్తె జన్మించడంతో, ఆమెను సింగిల్ మదర్‌గా పెంచింది. తన సంపాదనతోనే అంజెలాను అన్నీ తానై చూసుకుంది.

51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి
కుమార్తె జీవితంలో స్థిరపడిన తర్వాత, 51 ఏళ్ల వయసులో జవేరియా మళ్లీ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2024లో ఆమె వ్యాపారవేత్త అడీల్ హైదర్‌ను వివాహం చేసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం తన కుమార్తె అంజెలా ప్రోత్సాహమేనని జవేరియా వెల్లడించింది. అయితే, ఈ రెండో పెళ్లి కూడా విమర్శలకు గురైంది. కానీ ఆమె అభిమానుల నుంచి, అత్తారింటి వారి నుంచి ఆప్యాయత, మద్దతు లభించడంతో ఆ విమర్శలను ఎదుర్కొంది. జవేరియా అబ్బాసీ జీవితం సమాజంలో ధైర్యంగా తన నిర్ణయాలను తీసుకుంటూ, ఒంటరిగా పోరాడిన ఒక మహిళకు నిదర్శనంగా నిలిచిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications