'సలార్' ఖాతాలో వరస్ట్ రికార్డ్!
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. డార్లింగ్ నుంచి సినిమా వస్తోందంటే దాని బడ్జెట్ కనీసం రూ.300 కోట్లకు తక్కువైతే ఉండటంలేదు. సినిమా విడుదలైన తర్వాత బాగుందా? లేదా? అనే టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడురోజులు రోజుకు రూ.100 కోట్ల చొప్పున కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. ఈ కోవలోనే గతేడాది ప్రభాస్ నుంచి సలార్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. ఈ సినిమా దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసింది.
అటువంటి సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతోంది అంటే రేటింగ్ అదిరిపోవాలి. కానీ అత్యంత చెత్త రికార్డును సలార్ తన ఖాతాలో వేసుకుంది. కేవలం 6.15 రేటింగ్ మాత్రమే వచ్చింది. బాలయ్య సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరికి 9.36, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు గుంటూరు కారం కూడా 9.25 రేటింగ్ తెచ్చుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన డిజాస్టర్ మూవీ స్కంద కూడా చివరకు 8.15 రేటింగ్ దక్కించుకుంది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ కన్నా ఇవన్నీ ముందంజలో నిలిచాయి.

ప్రస్తుతం కల్కి చేస్తున్నాడు డార్లింగ్. రాజాసాబ్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ ప్రారంభమవుతుంది. ఇలా భారీ బడ్జెట్ చిత్రాలన్నీ లైనులో ఉన్నాయి. ఇటువంటి సమయంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రంమీద ఒక చెత్త రికార్డు నమోదవడంపై ప్రభాస్ అభిమానులు కలవరపడుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది. థియేటర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం టీవీలోకి వచ్చేసరికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఎందుకైందా? అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.












Click it and Unblock the Notifications