ప్రభాస్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

పాన్ ఇండియా రెబల్ స్టార్ గా, డార్లింగ్ గా దేశవ్యాప్తంగా అందరి హృదయాలను దోచుకుంది మాత్రం ప్రభాస్ ఒక్కడే. సినిమాల్లో విలన్లను హీరో చితక్కొడుతుంటే అందరూ దాన్ని ఆస్వాదిస్తారు. అటువంటి పోరాట దృశ్యాలకు ప్రభాస్ లాంటి పర్ ఫెక్ట్ కటౌట్ మాత్రమే సెట్ అవుతుందని అభిమానులు చెబుతుంటారు. హీరో అనే పదానికి సరైన నిర్వచనంగా ఉన్న డార్లింగ్ కు కూడా ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తనకు ఇష్టమైనవారి పేర్లను కూడా ప్రభాస్ చెప్పారు. అలాగే డార్లింగ్ కు నచ్చిన హీరోయిన్ కూడా ఒకరున్నారు.

ఆ హీరోయిన్ ఎవరోకాదు.. సాయిపల్లవి. తన నటన అంటే ఎంతో ఇష్టమని ప్రభాస్ కామెంట్స్ చేశాడు. సాయిపల్లవి నటన ఎంతో సహజంగా ఉంటుంది. నేచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న సాయిపల్లవికి అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఆ అభిమానుల్లో ప్రభాస్ కూడా ఒకరయ్యారు. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన తండేల్ సినిమా చేస్తుండగా, ప్రభాస్ రాజాసాబ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్-సాయిపల్లవి కాంబినేషన్ లో కూడా ఒక చిత్రం వస్తుందనే ఆశతో డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

pan india rebal star prabhas favorite heroine

రెబల్ స్టార్ నటిస్తున్న ప్రతి సినిమా రూ.300 కోట్లకు తక్కువగా కాకుండా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న కల్కి చిత్రానికి బడ్జెట్ రూ.600 కోట్లు అనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పాన్ ఇండియాగా కాకుండా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆసియా ఖండంలోనే 24 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే యోచనలో చిత్ర బృందం ఉంది. విడుదల తేదీ దగ్గరయ్యేకద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందంటున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోపాటు లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ తదితరులు నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+