'కల్కి' సినిమా హిట్ అవదు..! జ్యోతిష్యుడు జగన్నాథ్ గురూజీ

అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం చేస్తున్నారు. ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన డార్లింగ్ కల్కి చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితర భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో దీన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.

రూ.2వేల కోట్లు లక్ష్యంగా
ఒక్క ఇండియాలోనే రూ.2వేల కోట్ల కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకొని విడుదల కాబోతోంది. దీనికి ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం చేయగా అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డార్లింగ్ నుంచి తర్వాత రాబోయే చిత్రాలు రాజాసాబ్, స్పిరిట్, సలార్2. హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం జరుపుకుంటున్న కల్కిపైనే అందరి దృష్టి ఉంది. సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన పాట మాత్రం అద్భుతమైన ఆదరణ పొందుతోంది.

pan india rebal star Prabhas movie kalki ad2898 Not a hit Astrologer Jagannath Guruji

మినిమం కలెక్షన్లు వస్తాయి
ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు పండిత్ జగన్నాథ్ గురూజీ ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కల్కి ఊహించినస్థాయిలో హిట్ అవదని, సినిమాకు రావాల్సిన కలెక్షన్లు మాత్రం మినిమంగానే వస్తాయన్నారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మాత్రం తిరిగివస్తుందన్నారు. ప్రభాస్ జాతకంలో రెండు సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

వేణుస్వామి కనపడితే దబిడి దిబిడే
తెలుగులో వేణుస్వామి అనే జ్యోతిష్యుడు కూడా ప్రభాస్ జాతకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన జాతకం బాగోలేదని, సినిమాలు ఆడవంటూ పదే పదే చెప్పారు. వేణుస్వామి బయట ఎక్కడైనా కనపడితే దబిడి దిబిడి ఖాయమేనని డార్లింగ్ అభిమానులు గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్నాథ్ గురూజీ వంతు వచ్చింది. తాను ఫేమస్ అవడానికి ప్రభాస్ జాతకం చెబితే చాలని ఆయన అనుకొనివుంటారని, ప్రతి ఒక్కరికీ జాతకాల పేరుతో ప్రభాస్ పేరును ఉపయోగించుకొని పాపులర్ అవ్వాలనే కోరిక పుడుతోందని డార్లింగ్ అభిమానులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+