హ్యాప్పీ బర్త్ డే ప్రభాస్.. ఇండియాలో ఏ హీరోకి లేని రికార్డు !
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందు గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్ లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సత్తా ఆయన మూవీకే ఉందనడం అతిశయోక్తి కాదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దేశవ్యాప్తంగానే కాకుండా యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ప్రభాస్ కెరీర్..
ప్రముఖ నటులు దివంగత కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. 2004లో త్రిష సరసన నటించిన 'వర్షం' సినిమా ప్రభాస్ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటనకు గుర్తింపు దక్కినా కానీ.. చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

కాగా 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీతో ప్రభాస్‌కు ఎక్కడలేని ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసింది. దీంతో తెలుగు పరిశ్రమలో టాప్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ చేరిపోయాడు. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అదరగొట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు.
ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఈ మూవీ పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి - 2 , ప్రశాంత్ నీల్‌తో సలార్ 2.. అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 31న ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'బాహుబలి: ది ఎపిక్' (రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్‌గా) మళ్లీ రిలీజ్ కానుంది.
ప్రస్తుతం రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో.. బ్యాలెన్స్ షూట్ కూడా కంప్లీట్ చేయాలనే బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరో పక్క తన డేట్స్ ని హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ సినిమాకి కూడా కేటాయిస్తున్నారు.
కాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రిలీజ్ చేస్తుండడం ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం











Click it and Unblock the Notifications