రీసెంట్ టైమ్ లో బెస్ట్ టీజర్.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలే..!!
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ చిన్న సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్నాడు. మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తాజాగా తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'పాపం ప్రతాప్'.. ఈ చిత్రంలోని సరికొత్త స్టోరీ లైన్ కారణంగా ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదైలన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ మూవీ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న విడుదల కానుంది.
పెళ్లయిన మూడు రోజులకే ప్రతాప్ భార్య వదిలేసి వెళ్లిపోయింది.. ఆమె ఎందుకు అలా చేసింది..? ప్రతాప్ వద్ద లోపం ఏమైనా ఉందా..? మరి ఏం జరిగింది..? తిరిగి వాళ్లిద్దరూ కలిశారా..? లేదా..? అనేదే ఈ పాపం ప్రతాప్ మూవీ స్టోరీ లైన్. టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.

ఈ మూవీ టీజర్ చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే.. ఇటీవల ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో హిట్ మూవీ ఖాయం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక వేసవి కానుకగా పాపం ప్రతాప్ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇక విశేషం ఏంటంటే..? రిలీజ్ కు ముందే ఈ మూవీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీజర్ చూస్తుంటే పాపం ప్రతాప్ స్టోరీ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఎస్. పీ. దుర్గ నరేష్ దర్శకత్వం వహించారు. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర దేవ్ మాదిరెడ్డి ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఇక పాయల్ రాధకృష్ణ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ ఇప్పటికే ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన చిత్రాలను ఈటీవీ విన్ అందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications