తన మూత్రం తానే తాగిన ప్రముఖ నటుడు.. ఎవరు? ఎందుకో తెలుసా?
సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటుడు.. తన మూత్రం తానే తాగాడు. దీంతో ఆయన ఆరోగ్యం ఎంతో మెరుగుపడిందని తెలిపాడు. ఈ షాకింగ్ నిజాన్ని ఆయన స్వయంగా చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..? ఆయన అలా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా ? పరేశ్ రావల్ సంచలన విషయం తెలిపారు.
పరేశ్ రావల్.. తెలుగు, హిందీ, తమిళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈయన్ను చూడగానే మనకు గుర్తొచ్చే చిత్రాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్, క్షణక్షణం, మనీ సినిమాలు ముందుంటాయి. ఈ సినిమాల్లో ఆయన విలక్షణమైన నటనతో అందర్నీ మెప్పించాడు పరేశ్ రావల్.
ఇక హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భూత్ బంగ్లా అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తున్నాడు పరేశ్ రావల్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టాబూ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న హీరా పేరీ-3 లోనూ పరేశ్ రావల్ కీలక రోల్ చేస్తున్నాడు.
అయితే తాజాగా పరేశ్ రావల్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. "ఓ చిత్రం షూటింగ్ సమయంలో కాలికి గాయం అయింది. ముంబైలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. గాయం కారణంగా ఇక నా కెరీర్ ముగిసిపోతుందని భయపడ్డాను. కానీ నటుడు అజయ్ దేవగన్ తండ్రి.. యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవన్ నాకు ఓ సలహా ఇచ్చాడు. ఆస్పత్రికి వచ్చిన ఆయన.. త్వరగా గాయం నుంచి కోలుకోవాలంటే ఉదయం నీ మూత్రాన్ని నువ్వే తాగాలని సలహా ఇచ్చాడు.

ఫైటర్లు అందరూ ఇదే చేస్తారని, ఇలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదన్నాడు. అయితే మద్యం, మటన్ ముట్టొద్దని.. పొగ తాగడం చేయొద్దని తెలిపాడు. అతను చెప్పినట్లుగానే ప్రతి రోజు చేశా. 15 రోజుల్లో గాయం నయమైపోయింది.. ఎక్స్ రే రిపోర్ట్ డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఆ గాయం తగ్గాలంటే రెండు నుంచి రెండున్నర నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు" అని పరేశ్ రావల్ వివరించాడు. ఇక ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
-
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications