Video:జక్కన్న స్కూలుకు సమ్మర్ హాలిడేస్..ఫారిన్ టూర్‌కు సూపర్‌స్టార్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి విదేశీ ప్రయాణాలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ సమయంలో కూడా షూటింగ్ షెడ్యూల్స్ మధ్య దొరికిన చిన్న గ్యాప్ లో కూడా అమెరికా, యూరప్, దుబాయ్ లాంటి ఎన్నో దేశాలు చుట్టేశారు. కాస్త టైమ్ దొరికితే చాలు తుర్రు మని విదేశాలకు మహేష్ బాబు ఎగిరిపోతారు. అయితే ఒక్కడే కాదండోయ్.. మొత్తం ఫ్యామిలీతో ఈ మిల్క్ మ్యాన్ విదేశీ టూర్లకు వెళుతుంటాడు. అక్కడ కుటుంబంతో వెకేషన్‌ను స్పెండ్ చేసి తిరిగి షూటింగులకు హాజరవుతారు.

జక్కన్న స్కూల్లో డిసిప్లిన్
కథ ఇంతవరకు బాగానే ఉంది. అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఆయన స్కూల్లో చేరాలంటే డిసిప్లిన్ లేదా క్రమశిక్షణ తప్పనిసరి. ఎంత స్టార్‌డమ్ ఉన్న హీరో అయినా సరే.. జక్కన్న డిసిప్లిన్‌కు తలొగ్గాల్సిందే. ఇక జక్కన్న మెగాఫోన్ పట్టిన తర్వాత నటీనటులు సరైన కారణం లేకుండా షూటింగ్ డుమ్మా కొట్టడమంటే అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.

passport-back-bags-packed-where-is-mahesh-babu-headed-next

తరచూ ఇలా విదేశాలకు వెళ్లడం వల్ల రాజమౌళితో చేయబోయే భారీ చిత్రం 'SSMB29' పై మహేష్ బాబు దృష్టి పెట్టగలడా అని అభిమానులు, సినీ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే, రాజమౌళి పని విషయంలో చాలా కఠినంగా ఉంటారని, నటుల నుండి పూర్తి అంకితభావం కోరుకుంటారని అందరికీ తెలుసు.ఇక మహేష్ బాబు గురించి పూర్తిగా తెలిసిన రాజమౌళి... ఈ సూపర్ స్టార్‌ షూటింగ్ మధ్యలో విదేశాలకు వెళ్లకుండా కట్టడి చేయాలని చూశాడు.

మహేష్ బాబు పాస్‌పోర్టును లాగేసుకున్న రాజమౌళి
ఈ సందేహాలను సరదాగా పక్కకు పెట్టేస్తూ, షూటింగ్ ప్రారంభంలో రాజమౌళి ఒక వీడియో పోస్ట్ చేశారు.అందులో,షూటింగ్ గ్యాప్ లో మహేష్ బాబు ఎక్కడికీ వెళ్లకుండా ఉండటానికి ఆయన పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు సరదాగా చూపించారు.జస్ట్ పైకలా సరదాగా చూపించినప్పటికీ.. లోలోపల మాత్రం జక్కన్న చాలా సీరియస్‌గానే ఈ విషయాన్ని తీసుకున్నట్లు ఫిలింనగర్‌ టాక్. ఇక మహేష్ బాబుతో మూవీ తొలి షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. దీంతో జక్కన్న స్కూల్‌లో మహేష్ బాబుకు సమ్మర్ హాలిడేస్ వచ్చినట్లే అనుకోవాలి. అందుకే వెకేషన్ మూడ్‌లోకి వెళ్లి విదేశాలకు పయనమయ్యారు.

జక్కన్న స్కూల్‌కు సమ్మర్ హాలిడేస్
అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. అదేమో ప్రిన్సిపాల్ రాజమౌళి దగ్గర ఉండిపోయింది. ఇక జక్కన్న స్కూలుకు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి గనుక తన పాస్‌పోర్టును మహేష్ బాబు తిరిగి చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు వెళుతున్న క్రమంలో విమానాశ్రయంలో ఫోటోగ్రాఫర్లకు తన పాస్‌పోర్టును చూపిస్తూ చిరునవ్వుతో ముందుకు కదిలారు మహేష్ బాబు.పాపరాజీలకు తన పాస్‌పోర్ట్‌ను చూపిస్తూ నవ్వుతూ రాజమౌళి నుండి తిరిగి తీసుకున్నానని చెప్పారు."నా పని కమిట్‌మెంట్ అయిపోయింది. ఇక నా వెకేషన్ మొదలైంది" అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ఐకానిక్ డైలాగ్ "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను "అనే డైలాగును పోస్టు చేస్తున్నారు.

మొత్తానికి, రాజమౌళి పాస్‌పోర్ట్ దాచినా, మహేష్ బాబు ట్రిప్పులు మాత్రం ఆగలేదు. ఇప్పుడు మొదటి షెడ్యూల్ పూర్తి కావడంతో, మహేష్ బాబు తన అభిమాన విదేశీ విహారాలకు సిద్ధమయ్యారు. మరి, ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్తారో చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+