పవిత్రా లోకేష్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలకన్నా ప్రముఖ నటుడు నరేష్ తో డేటింగ్ విషయంపై ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచేది. నరేష్ అంటే పవిత్ర లోకేష్ అని, పవిత్ర లోకేష్ అంటే నరేష్ అనే పేరు స్థిరపడిపోయింది. కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది. తెలుగు, కన్నడలో వరుసగా సినిమాలు చేస్తోంది.
గతంలో ఒక దర్శకుడిని వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత నరేష్ కు దగ్గరైన పవిత్రా లోకేష్.. ఇద్దరూ కలిసి హోటల్ గదిలో ఉండగా నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి మీడియాను తీసుకువెళ్లి గొడవ చేసిన విషయం తెలిసిందే. అలా ఈ జంట బాగా పాపులరైంది. డేటింగ్ చేస్తున్నామంటూ ఇద్దరూ మీడియా ముందు ప్రకటించారు.

నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకుంటున్నామని చెప్పారుకానీ ఇంతవరకు వారి వివాహం జరగలేదు. ఇద్దరూ సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాల్లో స్క్రీన్ మీద వీళ్ళిద్దరి కాంబినేషన్ కనిపిస్తే చాలు ప్రేక్షకులందరూ విజిల్స్ వేస్తారంటే ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. పవిత్ర లోకేష్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
రోజువారీ సంపాదన విషయానికి వస్తే రూ.50 వేలకు పైగా ఉంటోంది. ఎప్పుడైతే నరేష్ తో పాపులారిటీ వచ్చిందో అప్పటి నుంచి పారితోషికాన్ని పెంచేసింది. ఒక రోజు మొత్తానికి షెడ్యూల్ ఇస్తే లక్ష రూపాయలు తీసుకుంటోంది. హీరోయిన్ రేంజ్ లో పవిత్ర లోకేష్ కి పాపులారిటీ ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తెలుగులో, కన్నడ సినిమాల్లో నటిస్తోంది.












Click it and Unblock the Notifications