పవన్ కళ్యాణ్ కి మరో షాక్.. పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి, అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి నోరు విప్పారు. ముందుగా తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్తూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని.. దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అంతే కాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని.. కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో దిగ్విజయంగా దూసుకుపోతూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన మాజీ భార్య అయిన రేణు దేశాయ్ పొలిటికల్ గా ఎంట్రీ గురించి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ గురించి కూడా ఆమె నోరు విప్పారు. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారని.. రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందన్ని జోరుగా ప్రచారం జరుగుతోంది. అవన్నీ వాస్తవాలు కాదని.. ఇప్పటికే తాను చాలా సార్లు చెప్పానని తేల్చారు. అకీరాకు సినిమాల్లోకి రావాలని ఉందని చెబితే.. స్వయంగా తానే ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆ విషయం అందరికీ చెప్తానని వెల్లడించారు. అప్పటి వరకు ఈ తరహా రూమర్లను ఆపాలని కోరారు.
తాను సినిమాల్లో నటించానని.. అలాగే వాళ్ల నాన్న, పెదనాన్న అలా ఫ్యామిలీ మొత్తం సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారని.. అందుకే ఒక తల్లిగా తన కొడుకును బిగ్ స్క్రీన్ పై చూడాలని అందరికంటే ఎక్కువగా తనకే ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడూ తనని ఫోర్స్ చేయనని.. ఏది చేయాలనిపిస్తే అదే చేయమని చెబుతానని తెలిపారు. దీంతో అకీరా ఓజీ సినిమాలో నటిస్తున్నాడని వస్తున్న ప్రచారానికి బ్రేక్ పడినట్టైంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..!











Click it and Unblock the Notifications