మంత్ ఆఫ్ వీరమల్లు బిగిన్స్.. 12 రోజుల మాస్ జాతర

Harihara Veeramallu: మచ్ అవైటెడ్ పీరియాడికల్ అడ్వెంచర్ మూవీ.. హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం.. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. క్రిష్ జాగర్లపూడి దర్శకుడు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం కింద ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు.

ఆయన నటించిన బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా.. ఇతర కీలక పాత్రలను పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. వీరమల్లు పేరుతో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు పవన్ కల్యాణ్. మొఘల్ సామ్రాజ్యం బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా తెరకెక్కింది. మొఘలుల పరమైన చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తస్కరించే యోధుడి పాత్ర ఇది. ఔరంగజేబ్ పాత్రను బాబీ డియోల్ పోషించాడు.

Pawan Kalyan fans set to celebrate huge Harihara Veeramallu release

సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ అభిమానులు.. మాస్ జాతరకు సిద్ధపడుతున్నారు. థియేటర్ల వద్ద సందడికి ఇప్పటి నుంచి సమాయాత్తమౌతోన్నారు. నెవర్ బిఫోర్ అన్నట్లుగా వీరమల్లు పండగ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విడుదల కాబోతోన్న తొలి సినిమా ఇదే కావడం వల్ల ఎప్పుడెప్పుడా అంటూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ తో ఓ ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోందీ మూవీ.

ఈ క్రమంలో ది మంత్ ఆఫ్ హరిహర వీరమల్లు పేరుతో వీడియో వదిలారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ ఎంత ఉత్కంఠతతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తోన్నారనేది ఈ వీడియోను చూస్తే అర్థం చేసుకోవచ్చు. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+