హీరోగా పవన్ కల్యాణ్ మొదటి భార్య కొడుకు..మెగా ఫ్యామిలీ అండగా నిలిచేనా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం తెరిచిన పుస్తకమే. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఆయన మొదట నందిని రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి దాంపత్య జీవితం రెండేళ్లు సాఫీగానే సాగింది. తరువాత విభేదాలు రావడంతో మొదటి భార్య నందిని రెడ్డికి పవన్ విడాకులు ఇవ్వడం జరిగింది.
తరువాత కొద్దిరోజులకే హీరోయిన్ రేణు దేశాయ్‌తో పవన్ ప్రేమలో పడ్డాడు. ఆమెతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తరువాతపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల పాటు కలిసి దాంపత్య జీవితం కొనసాగించిన పవన్ కళ్యాణ్.. తరువాత రేణు దేశాయ్‌కి సైతం విడాకులు ఇచ్చాడు. రేణు దేశాయ్‌తో విడిపోయిన తరువాత విదేశీయురాలైనా అన్నా లెజినోవాని మూడో వివాహం చేసుకున్నాడు.

అయితే పవన్ భార్యల్లో రేణు దేశాయ్ ,అన్నా లెజినోవా కొన్ని సందర్భాల్లోనైనా మీడియాలో కనిపించారు కాని.. మొదటి భార్య నందిని రెడ్డి మాత్రం బాహ్య ప్రపంచానికి దూరంగానే ఉన్నారు. పవన్‌తో విడాకులు తీసుకున్న తరువాత నందిని రెడ్డి మరో వ్యక్తిని వివాహం చేసుకుని .. విదేశాల్లో సెటిల్ అయ్యారని సమాచారం. తాజాగా పవన్ కల్యాణ్ మొదటి భార్యకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని రెడ్డి కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అవుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంచి అందంతో పాటు ఫిజిక్‌గా కూడా ఆకట్టుకునేలా ఉండటంతో నందిని రెడ్డి తన కొడుకును హీరో చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని తనకు పవన్ కల్యాణ్‌కు మధ్య ఉన్న ఓ కామన్ ఫ్రెండ్‌కు తెలియజేశారట.

కొడుకు ఎంట్రీ కోసం పవన్ కల్యాణ్ మద్దతు కోరుతూ..నందిని రెడ్డి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారనే మాటలు తెరపైకి వచ్చాయి. అయితే నందిని రెడ్డి కుమారుడు సినిమాల్లోకి వస్తారనే దానిలో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే నందిని రెడ్డి కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో వారు ఇక్కడకు వచ్చి సినిమాలు తీయడం అనేది జరిగే పని కాదు. ఒకవేళ నందిని రెడ్డి కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తే పవన్ కల్యాణ్ కాని , మెగా ఫ్యామిలీ కాని తనకి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications