‘హరిహర వీరమల్లు’లో బాలయ్య.. ఆ క్యారెక్టర్‌లో ఎంట్రీ అదుర్స్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు'. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 1 "స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్ లోనే ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిగా 2 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు. ట్రావెల్ వీడియోలు చేస్తూ ఉండే ఆయన.. ఇప్పుడు పవన్ సినిమా కోసం తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మూవీ సూపర్ డూపర్ హిట్..
ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఇప్పుడే సౌతాఫ్రికాలో 'హరి హర వీరమల్లు' చూసొచ్చాను. మూవీ సూపర్ డూపర్ హిట్, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నభూతో నభవిష్యతి!" అంటూ ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా అదరగొట్టాడని చెబుతూనే సినిమా స్టోరీతో పాటు పలు ట్విస్ట్ లను కూడా రివీల్ చేసేశారు.

బాలయ్య ఎంట్రీ అదుర్స్..
11వ శతాబ్దం కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. హరిహరరాయులు, బుక్కరాయులు కొత్త సామ్రాజ్యం కోసం తిరుగుతూ, ఆ తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో చేరి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారని వివరించాడు. వారి కొడుకే హరిహర వీరమల్లు అని, ఆయన శ్రీకృష్ణదేవరాయల తాత అని చెప్పాడు. కోహినూర్ డైమండ్‌ను ఎత్తుకెళ్లిన ఔరంగజేబును వీరమల్లు ఎదిరిస్తాడని కథనాన్ని వివరించాడు.
సినిమా కథ..
అంతే కాకుండా ఈ సినిమాలో బాలయ్య బాబు శ్రీకృష్ణదేవరాయల మనవడిగా ఎంట్రీ ఇవ్వడం పీక్స్ అని.. ఆ సీన్లకు ప్రేక్షకులు ఈలలు, కేకలు వేస్తున్నారని, ఆఫ్రికా ప్రజలు కూడా సినిమాకు ఫిదా అయ్యారని చెప్పాడు. దీంతో ఈ కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అసలు ట్విస్ట్..
కానీ రివ్యూ చివర్లో అన్వేష్ మరో పెద్ద ట్విస్ట్ రివీల్ చేశారు. ఇదంతా నిజమైన సినిమా రివ్యూ కాదని, సినిమా రివ్యూలు ఇచ్చే వారిపై సెటైరికల్‌గా చేసిన వీడియో అని స్పష్టం చేశాడు. ఈ వీడియో కనువిప్పు నాటకం కోసం చెప్పిందని.. దీన్ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోకండని కోరారు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదని.. సినిమా అనేది జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, దానికి అసలు రివ్యూలు ఎందుకు?" అని ప్రశ్నించారు.
ఒక సినిమా కోసం వెయ్యి మందికి పైగా పనిచేస్తారని, చెత్త రివ్యూల వల్ల సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత మరో సినిమా తీయకపోవచ్చని, దానిపై ఆధారపడిన వాళ్లందరికీ నష్టమని అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డని కంటుంది. అది ఇంకా కళ్లు తెరవకముందే చేతులు, కాళ్లు వంకరగా ఉన్నాయి, ముక్కు బాగోలేదు అంటూ చెబితే ఆ తల్లికి ఎంత ఆవేదనగా ఉంటుంది? నిర్మాత పరిస్థితి కూడా అంతే" అంటూ నిర్మాతల కష్టాన్ని వివరించాడు.
టెన్త్ ఫెయిల్ అయినవాడు యూట్యూబ్ ఛానల్ పెట్టేసి నోటికొచ్చినట్లు రివ్యూ చెప్పేస్తున్నాడు. యూట్యూబ్ ఇలాంటి చెత్త ఛానళ్లకు రెవెన్యూ ఆపేస్తే సగం దరిద్రం పోతుంది. సినీ ఇండస్ట్రీ కూడా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడు గానీ ఇలాంటి దరిద్రాలన్నీ ఆగవు" అంటూ మూవీ రివ్యూయర్లపై అన్వేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications