నో డౌట్.. రిలీజ్ ఫిక్స్.. హరిహర వీరమల్లుపై మేకర్స్ క్లారిటీ

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఇప్పటికే కమిటెడ్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'హరిహర వీరమల్లు' కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. చాలా సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ డేట్ కూడా సినిమా రిలీజ్ కాలేదు. మళ్లీ అప్పుడు మే 9న చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

pawan-kalyan-harihara-veeramallu-makers-clarity-on-release-date

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ మూవీ యూనిట్ సైలెంట్ గా ఉండడంతో సినిమా రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని.. అంతే కాకుండా పవన్ కుమారుడు అనుకోని రీతిలో ప్రమాదంలో గాయపడడంతో ఆ షూటింగ్ లో పాల్గొనడం కష్టమే అని చర్చ జరుగుతోంది. దీంతో సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సినిమా రిలీజ్‌పై మరోసారి క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆ పోస్టులో.. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' పనులు శరవేగంగా జరుగుతున్నట్లు రాసుకొచ్చారు. రీ రికార్డింగ్‌, డబ్బింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయని.. ఈ వేసవికి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రకటించినట్లే మే9 న మూవీ రిలీజ్ అవుతుందని.. ప్రేక్షకులు అంతకుముందు ఎప్పుడూ చూడని సినిమాటిక్‌ అనుభూతికి సిద్ధంగా ఉండాలన్నారు. అంతే కాకుండా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ - హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+