Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా వచ్చేనా ?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఆయన నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. తొలి భాగం " స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమా జూన్ 12న థియేటర్లకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు.

pawan-kalyan-harihara-veeramallu-movie-new-release-date-july-24

దీంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌, ఇటూ మెగా అభిమానుల సందడి మొదలైంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ మూవీ యూనిట్ సైలెంట్ గా ఉండడంతో సినిమా రిలీజ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యిందని అంతా భావించారు. అనుకున్నట్టే సినిమా విడుదలని వాయిదా వేశారు. దాదాపు 14 సార్లు వాయిదా పడి ఆ విషయంలో కూడా రికార్డు సృష్టించింది ఈ మూవీ.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జూలై 24న మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్‌ వెల్లడించారు. ఈమేరకు మూవీ టీం కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాకుండా త్వరలోనే ఓ పవర్‌ఫుల్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

మరోవైపు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాను కూడా పవన్ ఫినిష్ చేసేశారు. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ టీమ్ ప్లాన్ చేస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+