"హరిహర వీరమల్లు" మూవీ రివ్యూ.. అక్కడే తేడా కొట్టింది..!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. పీరియాడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' మొత్తానికి థియేటర్ల లోకి వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలలో నటిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా చేయగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.
పవన్ రాజకీయాల బిజీ షెడ్యూల్, విఎఫ్ఎక్స్ పనుల జాప్యం వల్ల సుమారు 14 సార్లు వాయిదా పడగా.. ఈ విషయం కూడా ఓ రికార్డుగా నిలిచింది. ఆయన కెరీర్ లోనే ఇది మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా గతంలో ఎప్పుడూ లేని విధంగా పవన్ స్వయంగా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో మూవీకి మరింత హైప్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 1 "స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో నేడు (జూలై 24, 2025 ) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నిన్ననే తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ షో లు వేశారు. మరి 'హరిహర వీరమల్లు' గా పవన్ ప్రేక్షకులను ఆ కట్టుకున్నారో లేదో తెలుసుకుందాం..?

కథ:ఈ సినిమా 16వ శతాబ్దంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ. హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచి పెట్టే దొంగ. మరోవైపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ డియోల్) ఢిల్లీ పీఠంపై అధికారం చేపట్టి హిందూ ప్రజలపై మత మార్పిడికి ఒత్తిడి తీసుకొస్తూ, జిజియా పన్ను విధిస్తూ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. చిన్న దొర (సచిన్ కేడ్కర్) తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలని వీరమల్లుతో చిన్న దొర డీల్ కుదుర్చుకుంటాడు. అందుకు గాను బందరు నుంచి హైదరాబాద్ నవాబుకు వజ్రాల రథాన్ని చార్మినార్ వరకూ వచ్చి అందులోని సంపదను అపహరిస్తాడు.
ఇక్కడే పంచమి (నిధి అగర్వాల్) పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడ నుంచి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు. వీరమల్లు ప్రతిభ చూసిన గోల్కొండ నవాబు అతనికి ఒక మిషన్ అప్పగిస్తాడు. ఢిల్లీకి వెళ్లి, మొఘల్ చక్రవర్తి వద్ద ఉన్న కోహినూర్ వజ్రంను దొంగలించి తీసుకురావాలని చెబుతారు. వీరమల్లు ఎందుకు ఈ మిషన్‌కి ఒప్పుకున్నాడు? పంచమి (నిధి అగర్వాల్) పాత్ర ఏమిటి? ఔరంగజేబు సామ్రాజ్యంలోకి అతను ఎలా చొరబడ్డాడు అనేది స్టోరీ.

మూవీ రివ్యూ..
ఓ పీరియాడికల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కావడం వల్ల సినిమాకు ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఐదేళ్లకు పైగా సెట్స్ మీద ఉండినప్పటికీ కథ ఆధునికంగా ఉండాల్సిన అవసరం లేకపోవడం సినిమాకి ఉపయోగపడింది. చారిత్రాత్మక నేపథ్యంతో పాటు సనాతన ధర్మం, రాజకీయ చైతన్యం, సామాజిక సందేశం అనే అంశాలను పవన్ కళ్యాణ్ పాత్రలో బలంగా చూపించారు. ఆయన నిజ జీవితానికి ఇది బాగా కనెక్ట్ అయ్యే విషయం.
వీరమల్లుగా పవన్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్సులు, ఎలివేషన్ సీన్స్, "కొల్లగొట్టినాదిరో" పాట, పోర్ట్ ఫైట్, చార్మినార్ సన్నివేశాలు.. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా బాగా నచ్చుతుంది. కానీ సెకండాఫ్ వస్తే అక్కడ కథనం కాస్త డీలా పడుతుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. వీఎఫ్ఎక్స్ పనితనంలో తీవ్ర లోపాలు కనిపించాయి. కొన్నిచోట్ల పవన్ లుక్స్ కూడా సింక్ కాకపోవడం, గ్రాఫిక్స్ బలహీనతలు మూడ్‌ని చెడగొట్టినప్పటికీ... పవన్ స్వయంగా డిజైన్ చేసిన చౌకిదానా ఫైట్ ఎపిసోడ్ మళ్ళీ సినిమాని ట్రాక్‌లోకి తీసుకువచ్చింది.
నటీనటుల పర్ఫామెన్స్: పవన్ కళ్యాణ్ ఈ సినిమాను పూర్తిగా తన భుజాలపై మోశారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అదరగొట్టారు. సనాతన ధర్మంపై ఆయనకు ఉన్న విశ్వాసం, పాత్రలోనూ ప్రతిబింబించడమే కాకుండా, రాజకీయ వాఖ్యాతలాగా కూడా పలుసార్లు కనిపిస్తారు.
నిధి అగర్వాల్ పంచమిగా మంచి ప్రెజెన్స్ చూపించారు. పాటల్లో గ్లామర్‌ను, పాత్రలో ఎమోషన్‌ను సమతూకంగా పోషించారు.
విలన్‌గా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయ్యాడు. ఔరంగజేబు లుక్స్ బాబీ మంచి ఛాయిస్. కన్నులతోనే విలనిజాన్ని పండించాడు. అయితే, హీరో - విలన్ మధ్య వచ్చే సీన్స్ ఒక్కటి కూడా లేదు. అది సెకండ్ పార్ట్ లో ఉంటుంది.
ఇక మిగితా వారిలో.. సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజు, కోట శ్రీనివాసరావు పర్వలేదు అనిపించారు. అనసూయ ఓ సాంగ్ కు పరిమితం అయింది.

విశ్లేషణ:ఎమ్ఎం కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం. ఫస్ట్ హాఫ్ నుండి క్లైమాక్స్ వరకు నేపథ్య సంగీతం సినిమాలో పవన్ పవర్‌ను ఎక్కువగా ఎలివేట్ చేసింది. పాటలు కూడా చక్కగా రూపొందించబడ్డాయి.
మనోజ్ పరమహంస విజువల్స్ మెరిపించాయి కానీ, వీఎఫ్ఎక్స్ లోపించడంతో ఆ మ్యాజిక్ కొద్దిగా తగ్గింది.
పవన్‌కు తగిన ఎలివేషన్ ఇవ్వడంలో దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ విజయం సాధించారు. డైరెక్షన్ విషయంలో ఇద్దరు దర్శకులు పని చేసినప్పటికీ, స్క్రీన్‌ప్లే కాస్త తేలిపోయిన సందర్భాలున్నాయి.
ప్లస్ పాయింట్స్..
- పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్
- ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్‌గా ఉండడం
- ఎలివేషన్ సీన్స్
- ఎంఎం కీరవాణి మ్యూజిక్
- ఫస్ట్ పార్ట్‌ను ముగించే విధానం
మైనస్ పాయింట్స్..
- సెకండాఫ్‌లో కథనం తేలిపోవడం
- వీఎఫ్ఎక్స్
- హీరో-విలన్ మధ్య కనెక్షన్ లేకపోవడం
-
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!!












Click it and Unblock the Notifications