Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ విధ్వంసం.. "హరిహర వీరమల్లు" ట్రైలర్ రిలీజ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు నిమిషాల వ్యవధితో వచ్చిన ఈ ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటికే చాలా సార్లు సినిమా రిలీజ్ వాయిదా పడడంతో.. మూవీ విషయంలో ఆశలు వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈ ట్రైలర్ తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయింది ట్రైలర్ అనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ దుమ్ము లేపేసాయి.

ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా.. తొలి భాగం " స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దీంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌, ఇటూ మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

pawan kalyan harihara veeramallu movie trailer released

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మించారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు. మొదట్లో ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాదాపు 14 సార్లు వాయిదా పడి ఆ విషయంలో కూడా రికార్డు సృష్టించింది ఈ మూవీ. కాగా ఎట్టకేలకు జూలై 24న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌, సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

మరోవైపు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాను కూడా పవన్ ఫినిష్ చేసేశారు. ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ టీమ్ ప్లాన్ చేస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+