పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ధర్మం కోసం యుద్ధం త్వరలో.. శ్రీరామనవమి సర్ప్రైజ్!!
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ, శ్రీరామనవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు హరిహర వీరమల్లు చిత్ర యూనిట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా నిర్మితమవుతున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కు సంబంధించి పోస్టర్ నేడు రిలీజ్ చేసి సినిమాపై బోలెడన్ని అంచనాలను పెంచారు చిత్ర యూనిట్.
హరిహర వీరమల్లు .. పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు
ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే అభిమానులను సంబరాల్లో ముంచుతున్నాయి, ఇక హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన టీజర్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు కూడా గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీ కావడంతో మధ్యలో కొంత బ్రేక్ తర్వాత చిత్ర నిర్మాణం జరుగుతూ వచ్చింది.

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
మూడేళ్లు పూర్తయినా సినిమా షూట్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇక ఇదే సమయంలో చిత్ర యూనిట్ హరిహర వీరమల్ల సినిమా త్వరలోనే ఉందని, అప్డేట్స్ వస్తాయని, గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని చెబుతూ ఒక ట్వీట్ చేసింది. తాజాగా పోస్టర్ ను రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు శ్రీరామనవమి రోజు బహుమతి నిచ్చింది.
ధర్మం కోసం యుద్ధం త్వరలో
శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్లో కత్తి పట్టుకుని పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్ తో సూటిగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. దీనిపైన మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ హరిహర వీరమల్లు గా కనిపించబోతున్నాడు అంటూ ట్వీట్ చేసింది.
త్వరలోనే టీజర్ రిలీజ్
శ్రీరామనవమి శుభాకాంక్షలతో జైశ్రీరామ్ అంటూ పవన్ కళ్యాణ్ పోస్టర్ ను రిలీజ్ చేసి, త్వరలోనే టీజర్ ఉందని ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో పాన్ ఇండియా సినిమాగా ముందుకు రాబోతుంది.












Click it and Unblock the Notifications