'మన శంకర వరప్రసాద్ గారు' పై పవన్ కల్యాణ్ షాకింగ్ రివ్యూ..!
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగు చిత్ర సీమలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. చిరు సుదీర్ఘ కెరీర్ లో ఇప్పటిదాకా మాస్, యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ.. తొలిసారి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎనలేని ప్రశంసలు దక్కాయి. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చిరంజీవికి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో చిరు కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గానూ ఈ మూవీ రికార్డు కొట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Hearty congratulations to Megastar Chiranjeevi garu @KChiruTweets, and the entire team of #ManaShankaraVaraPrasaGaru on Mega Blockbuster success.
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 22, 2026
For over four decades, Chiranjeevi garu has remained close to the hearts of people, continuing to entertain with the same passion… pic.twitter.com/uajJOWOQHz
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయనకు చెందిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, 'మన శంకర వరప్రసాద్ గారు' టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. విక్టరీ వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్ అదిరింది అని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. సంక్రాంతికి మరో భారీ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి ప్రతిభను కొనియాడారు.

'నాలుగు దశాబ్దాల నుండి అన్నయ్య చిరంజీవి గారు మన అందరి హృదయాలను ఎలా గెలుచుకున్నారో, ఇప్పటికీ తన అద్భుతమైన నటన, కామెడీ, డ్యాన్స్ తో అది కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ఆయన అద్భుతమైన ఫిల్మోగ్రఫీ లో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ప్రత్యేకమైన అభినందనలు. మెగాస్టార్ చిరంజీవి గారిని, విక్టరీ వెంకటేష్ గారిని ఒకే ఫ్రేమ్ లో వెండితెరపై చూడడం కనుల పండగలా అనిపించింది. భీమ్స్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గార్లకు ప్రత్యేక శుభాకాంక్షలు' అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
-
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! -
"ఐరన్ లెగ్".. అప్పుడు ఆమెలానే.. ఇప్పుడు ఈమెకి కూడా ?? -
సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్గా డిప్యూటీ స్పీకర్ ! -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్..












Click it and Unblock the Notifications