ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్ కల్యాణ్?

పవన్ కల్యాణ్ అనే పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా ఒక స్టార్ హోదాలో పవర్ స్టార్ అనే బిరుదుతో కొనసాగుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపంచిన పవన్ కల్యాణ్ ఆ పార్టీని నడపడం కోసం, ప్రజలకు దగ్గరవడం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడంద్వారా తాను తెలుసుకున్న భావజాలాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం జనసేన పార్టీద్వారా దగ్గరవుతూ వస్తున్నారు.

వాస్తవానికి రాజకీయ పార్టీని నడపడం అంటే సాధారణ విషయం కాదు. కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. వాస్తవానికి గతంలోనే పవన్ సినిమాలు మానేద్దామనుకున్నారు. కానీ పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే పలుమార్లు చెప్పారు. ఏపీకి ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికల సంఘం నుంచి రేపో, మాపో ప్రకటన రావడమే తరువాయి. తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టడానికి జనసేనాని సమాయత్తమవుతున్నారు.

pawan kalyan hyderabad property for sale

కొన్నాళ్ల ముందే నిర్మాతల దగ్గర తన రెమ్యునరేషన ను అడ్వాన్స్ రూపంలో తీసుకొని ఆ డబ్బును పార్టీకి ఖర్చుపెడుతూ వస్తున్నారు. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో సమయం చూసుకొని వారికి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడవడం ఖాయమనే అంచనాలుండటంతో జనసేనను కూడా వైసీపీని ధీటుగా ఎదుర్కొనేలా మలుచుతున్నారు. గతంలో డబ్బులు అవసరమై హైదరాబాద్ లో తన ఇంటిని అమ్మేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోనే తన పేరుతో ఉన్న రెండు స్థలాలను అమ్మకానికి పెట్టారు. ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది. పార్టీకి విరాళాలు వస్తున్నాయికానీ అనుకున్నంత స్థాయిలో రాకపోవడంవల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సొంత డబ్బులద్వారా పార్టీని నడపడానికి కష్టపడుతున్నారంటే ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకోవచ్చని, అందుకే తాము ఆయనకు మద్దతుగా నిలుస్తామని అభిమానులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+