ఎవరితోనూ విభేదాల్లేవ్..అల్లు అర్జున్ పేరు తెర మీదకు తెచ్చిన పవన్ కల్యాణ్

మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.

పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఆ మధ్య మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై పరోక్షంగా సెటైర్స్ వేశారు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.

Pawan Kalyan mentioned Allu Arjun name in public meeting

పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక రామ్ చరణ్ భార్య పుట్టిన రోజు సందర్భంగా అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమెకు విషెష్ చెప్పలేదు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజుల వేడుకలకు కూడా మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది. దీంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు నిజమే అని అంతా భావించారు. ఇటువంటి తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా కంకిపాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..టాలీవుడ్‌లో ఎవరితోనూ నేను పోటీపడను నేను సినిమా చేయాలంటే డబ్బులు ఉండాలి. సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటా. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. రాష్ట్రాన్ని బాగుచేసుకుని ఆ తర్వాత విందులు, వినోదాలు చేసుకుందమని పవన్ కల్యాణ్ తెలిపారు.

అలాగే నాకు సినిమా అంటే గౌరవం, ప్రేమ. తనకు ఏ హీరోతోనూ విభేదాలు లేవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అందరి హీరోలు నాతో బాగుంటారు. అందరి హీరోలను తాను గౌరవిస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.తెలుగు సినిమా హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని, రామ్ చరణ్ కావొచ్చు యల్ అందరు హీరోలు బాగుండాలి అని కోరుకుంటాను. అయితే ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ నోటి నుంచి అల్లు అర్జున్ పేరు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని పవన్ కల్యాణ్ చెప్పినట్టు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+