పవన్ "ఓజీ" నుంచి వినాయక చవితికి సర్‌ప్రైజ్ గిఫ్ట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (OG)". యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, పవన్ స్టైల్, యాక్షన్ మేనరిజంలకు ఫుల్ డోస్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా కనిపించనుండగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. "హరిహర వీరమల్లు" సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు.. "ఓజీ" సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు
ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని రెండో పాటగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ ఆగష్టు 27న మేకర్స్ వినాయక చవితి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్". హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications