'హరిహర వీర మల్లు' ట్రైలర్ చూసి పవన్ షాకింగ్ రియాక్షన్.. డైరెక్టర్ ను పిలిచి.. వీడియో వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న మూవీ 'హరిహర వీర మల్లు' ఈ మూవీ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు జులై 24 న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ జులై 3 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ 'హరిహర వీర మల్లు' ట్రైలర్ ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యోధుడిగా నటిస్తున్న మూవీ 'హరిహర వీరమల్లు'. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధం కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ కోసం అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో జులై 3న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా పవన్ కల్యాణ్ వీక్షించారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, చిత్ర నిర్మాత రత్నం, డైరెక్టర్ తో కలిసి పవన్ ట్రైలర్ వీక్షించారు. అనంతరం ట్రైలర్ అద్భుతంగా వచ్చిందంటూ దర్శకుడిని పవన్ మెచ్చుకుని హగ్ చేసుకున్నారు. తుపాన్ లా సినిమా ప్రేక్షకుల ముందుకు దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
PAWAN KALYAN WATCHES TRAILER OF 'HARI HARA VEERA MALLU' – TRAILER LAUNCHES TOMORROW – PAN-INDIA RELEASE ON 24 JULY 2025... #PawanKalyan watched the trailer of his upcoming film #HariHaraVeeraMallu and hugged director #JyothiKrisna as a gesture of appreciation.… pic.twitter.com/tUOTvhxHao
— taran adarsh (@taran_adarsh) July 2, 2025
ఇక ఈ మూవీ ట్రైలర్ జులై 3 ఉదయం 11.10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే తెలిపింది. ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఏ విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురవ్వకూడాదని ముందు జాగ్రత్తగా అభిమానులకు రిక్వెస్ట్ నోట్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

ప్రియమైన పవన్ కల్యాణ్ అభిమానులారా! థియేటర్లలో హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదల కారణంగా.. మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని మేము కోరుతున్నాం. కటౌట్లు ఏర్పాటు చేసేటప్పుడు, ఉత్సవాల్లో పాల్గొనేటప్పుడు.. థియేటర్లు.. చుట్టుపక్కల ప్రాంతాలకు నష్టం జరగకుండా చూసుకోండి. వీరమల్లు ను సెలబ్రేట్ చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లండి అంటూ ఓ రిక్వెస్ట్ నోట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
-
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. "రెండో జన్మ" అంటూ !! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
పెద్దితో అఖిల్ అక్కినేని డైరెక్ట్ ఫైట్- లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ -
‘అరవ’ దర్శకులను నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! -
ఎక్స్ క్లూజివ్.. అంతా చూడొచ్చు.. డిజిటల్ బెగ్గింగా ? డిజిటల్ వ్యభిచారమా ?? -
హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా - యాంకర్ -
ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కూడా నటించిందని తెలుసా..?












Click it and Unblock the Notifications