కోర్టు, కన్నప్ప కంటే దారుణమా..! ముందుగానే ఓటీటీలోకి 'హరిహర వీరమల్లు'..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు' మూవీ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ చెప్పారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించింది. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్స్ జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఓటీటీ రైట్స్ రూ. 50 కోట్లకు అమ్ముడయ్యాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అయితే మూవీకి నెగెటివ్ టాక్ వచ్చినా రిలీజ్ కు ముందు రోజు రాత్రి పడిన ప్రీమియర్స్ షోలతోనే రూ. 30 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా మూవీ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం, హరిహర వీరమల్లు విడుదలైన రోజు, ఇండియాలో అన్ని భాషల్లో కలిపి, రూ. 31.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఓపెనింగ్ గ్రాస్ రూ.44.20 కోట్లకు చేరుకుంది.
ఇక రెండో రోజు అయితే హరి హర వీరమల్లు కుప్పకూలిపోయింది. సాక్నిల్క్ మీడియా అంచనా ప్రకారం ఇండియాలో 2వ రోజు హరి హర వీరమల్లు రూ.8 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఫస్ట్ డే తో పోల్చితే వసూళ్లు 74 శాతం పడిపోయాయని మీడియా అంచనా వేసింది. ఇక మూడో రోజు కూడా హరి హర వీరమల్లు కు షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. డే 3 ఎర్లీ ట్రెండ్ ప్రకారం హరి హర వీరమల్లు ఇండియా వైడ్ రూ. 1.56 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ హరి హర వీరమల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. దీంతో అమెజాన్ ప్రైమ్ లో హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల తర్వాత హరి హర వీరమల్లు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని టాక్. అయితే ముందుగానే రిలీజ్ అవుతుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications