Akira Nandan:పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే: అకీరాను లాంచ్ చేసేది ఆ బడా నిర్మాతే...?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆ ఉత్కంఠ అంతా మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో యువ శక్తి చుట్టూ తిరుగుతోంది. అతను మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్.తెరపైకి అడుగు పెట్టకముందే, అకీరా నందన్ పేరు యువతలో, మెగా అభిమానుల్లో ఒక బలమైన బజ్ క్రియేట్ చేస్తోంది.ఇప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్నా, ఆయన ఒక్కసారి పబ్లిక్‌లోకి వచ్చినా, లేక పుట్టినరోజు వేడుక జరిగినా... సోషల్ మీడియా క్షణాల్లో హీటెక్కిపోతోంది.

రాజకీయం టు ఆధ్యాత్మికం:అకీరా నందన్ కొత్త లుక్
ఇటీవల అకీరా నందన్.. తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి కొన్ని ప్రభుత్వ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయనలో వచ్చిన మార్పు, కండలు తిరిగిన దేహం, ఆత్మవిశ్వాసంతో కూడిన బాడీ లాంగ్వేజ్ చూసి కేవలం అభిమానులే కాదు, సగటు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.అకీరా ఎత్తు, పర్సనాలిటీ చూస్తే..'పక్కా ఇంటర్నేషనల్ హీరో మెటీరియల్' అని సినీ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.

pawan-kalyan-son-akira-nandan-to-be-launched-withpan-worldfilm-people-media-factory-reveals-plan

ప్రస్తుతం అకీరా నందన్ సంగీతం, మార్షల్ ఆర్ట్స్‌పై దృష్టి సారించినప్పటికీ, రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఆయన వెండితెర అరంగేట్రం ఉంటుందని బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు, అకీరా నటనలో శిక్షణ కూడా మొదలుపెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సహజంగానే, అకీరాను ఎవరు లాంచ్ చేస్తారు? ఏ దర్శకుడు, ఏ నిర్మాత ఈ భారీ బాధ్యతను భుజానికెత్తుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

టి.జి. విశ్వప్రసాద్ సంచలన స్టేట్‌మెంట్
ఈ ఉత్కంఠకు తెర దించుతూ,ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ఒక సంచలన ప్రకటన చేశారు.పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధం, భవిష్యత్తులో ఆయనతో పనిచేసే అవకాశం గురించి మాట్లాడిన విశ్వప్రసాద్,అకీరా నందన్ డెబ్యూ గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి."అకీరా నందన్‌ను లాంచ్ చేసే అదృష్టం నాకు దక్కితే,అది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా కాదు... ఏకంగా 'పాన్ వరల్డ్' ప్రాజెక్ట్ అవుతుంది!" అని టి.జి. విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

విశ్వప్రసాద్ మాటల్లోని నమ్మకం, అకీరా పర్సనాలిటీకి అద్దం పడుతోంది."అకీరా ఎత్తు, పర్సనాలిటీ చూస్తే పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనిపిస్తోంది.మా బ్యానర్ నుంచి పాన్ వరల్డ్ సబ్జెక్ట్‌పై ఇప్పటికే వర్క్ జరుగుతోంది.అవకాశం వస్తే అకీరాను దాని ద్వారానే లాంచ్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నాను"అని ఆయన అన్నారు.

మహేష్ బాబుతో రాజమౌళి పాన్ ఇండియా సినిమాపై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, అకీరా నందన్ కోసం ఏకంగా 'పాన్ వరల్డ్' స్థాయి ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నామని ఒక అగ్ర నిర్మాత ప్రకటించడం మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేసింది. త్వరలోనే ఈ యువ రాజకుమారుడి సినీ ప్రయాణంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+