"ఉస్తాద్" ఊచకోతకు సిద్ధమా.. మార్చి 19 రిలీజ్ ఫిక్స్ !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ మూవీతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మార్చి 26న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి కావడంతో వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఉగాదికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలిపారు. 'ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత' అంటూ కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. పోలీస్ ఆఫీసర్‌గా పవన్‌ స్టైలిష్‌గా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

pawan-kalyan-usthad-bhagath-singh-release-date-confirmed-to-march-19-by-makers-and-post-got-viral

ఇప్పటికే విడుదల చేసిన పాట, వీడియోలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

అయితే మార్చి రేసులో ఉన్న 'పెద్ది', 'ప్యారడైజ్', 'టాక్సిక్' వంటి సినిమాలు వాయిదా పడటంతో బాక్సాఫీస్ ఖాళీ అయింది. దాంతో మార్చి 26 విడుదల ప్లాన్ చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం ముందు రిలీజ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+