ఆ స్టార్ హీరోయిన్‌కు 24 లక్షల వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషి సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా ఖుషి సినిమా నిలిచింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఖుషి బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఖుషి సినిమాకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్‌కు పదేళ్లపాటు హిట్లు లేవంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Pawan Kalyan s Diamond Necklace To Parvathi Melton

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఘన విజయం సాధించింది. పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన గతంలో ఓ రూమర్ బాగా వైరల్ అయింది. అదేంటంటే..పవన్ కల్యాణ్ ఓ హీరోయిన్‌కు 24 లక్షలు విలువ చేసే వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చారట. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు పార్వతి మెల్టన్. మాటల మాంత్రికుడు, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన జాల్సా సినిమాలో పార్వతి మెల్టన్ సెకండ్ హీరోయిన్‌గా నటించింది.

ఈ బ్యూటీకి అప్పట్లో పవన్ కళ్యాణ్ వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చాడని రూమర్స్ తెగ హల్చల్ చేశాయి. అయితే ఈ రూమర్లపై అటు పవన్ కల్యాణ్ కానీ, ఇటు పార్వతి మెల్టన్ కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఇదింతా కేవలం ప్రచారమే అని తేలిపోయింది. ఇక పార్వతి మెల్టన్ విషయానికి వస్తే.. 2005లో వచ్చిన వెన్నెల సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పార్వతి మెల్టన్. ఆ తర్వాత గేమ్, అల్లరే అల్లరి, హల్లో వంటి సినిమాలు నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో పార్వతి మెల్టన్ నెమ్మదిగా ఫెడ్ అవుట్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+