పవన్ కల్యాణ్‌ను నడిరోడ్డు మీద క్లాస్ పీకిన అమ్మాయి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికి ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

లక్షలాది అభిమానులు ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కల్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి కూడా అందరికి తెలిసిందే. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి ఇద్దరి భార్యలకు పవన్ కల్యాణ్ విడాకులిచ్చారు.

Pawan Kalyan s First Love Was Rejected

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ యంగ్‌గా ఉన్న సమయంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడమే కాకుండా , పవన్ కల్యాణ్‌కు క్లాస్ కూడా పీకిందట. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు మద్రాస్‌లో ఓ ఇన్‌స్టిట్యూట్‌కు కంప్యూటర్ క్లాస్ కోసం వెళ్లేవారు. అక్కడే పవన్ కళ్యాణ్‌కు తొలిప్రేమ పుట్టింది.

ఇదే ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే ఓ అమ్మాయితో పవన్ కళ్యణ్‌కు స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఎంతో క్లోజ్ ఉండేవారు.సరిగ్గా కోర్స్ అయిపోయే సమయానికీ వారిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది.దాంతో పవన్ కళ్యాణ్ అది ప్రేమ అనుకోని అదే విషయాన్నీ ఆ అమ్మాయికి తెలియజేశాడు. కానీ ఆ అమ్మాయి నో చెప్పడమే కాకుండా పవన్ కళ్యాణ్‌కు ఫుల్ క్లాస్ పీకిందట. అసలు నీ వయసు ఏంటి? నువ్వు ఏంటి? అని తిట్టడంతో నేను టీచర్ ను ప్రేమించానా అని అనుకున్నాడట.ఈ విషయాన్ని పవన్ కళ్యాణే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+