అన్న మన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.. !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా కథ, దర్శకత్వంపై విమర్శలొచ్చాయి. ముఖ్యంగా సినిమాలోని కోర్ ఎమోషన్ సరిగా ప్రజెంట్ చేయలేదని, సెకండ్ హాఫ్ బాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కొంతవరకు నిరాశ చెందారంటే "హరిహర వీరమల్లు" ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్రిష్ జాగర్లమూడి మొదట ఈ సినిమాను తెరకెక్కించినా, తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం సినిమా అవుట్ పుట్‌పై ప్రభావం చూపిందని అభిమానులు తేల్చేశారు. జ్యోతి కృష్ణకు పెద్దగా అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోవడం వంటి విమర్శలు వచ్చాయి.సినిమాలోని కంటెంట్ ఒక మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రధానంగా అత్యంత దారుణమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కారణంగా అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, చిన్న సినిమాల్లో కూడా కనిపించే క్వాలిటీ VFXను కూడా అందించలేకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతమైన VFXతో వస్తున్న ఈ రోజుల్లో, ఇంతటి భారీ సినిమాకు కనీస స్థాయి నాణ్యత లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా నిలిచింది. ఇక పవన్ కల్యాణ్ క్రేజ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 18 రోజులు పూర్తి చేసుకున్న సమయానికి సాధించిన మొత్తం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి:
నిజాం: రూ.9.39 కోట్లు
సీడెడ్: రూ.16 కోట్లు
యూఏ: రూ.83 కోట్లు
ఈస్ట్: రూ.54 కోట్లు
వెస్ట్: రూ.5 కోట్లు
గుంటూరు: రూ.5.57 కోట్లు
కృష్ణా: రూ.4.83 కోట్లు
నెల్లూరు: రూ.2.06 కోట్లు
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మొత్తం: రూ.58.03 కోట్లు (రూ.86.55 కోట్లు~ గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ.5.02 కోట్లు
ఓవర్సీస్: రూ.6.32 కోట్లు (సుమారు)
మొత్తం ప్రపంచవ్యాప్త కలెక్షన్స్: రూ.69.37 కోట్లు (రూ.114.35 కోట్లు~ గ్రాస్)
సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.127.5 కోట్ల రేంజ్‌లో ఉంది. ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కేవలం 54% రికవరీ మాత్రమే. క్లీన్ హిట్ సాధించాలంటే ఇంకా రూ.58.13 కోట్లు షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్‌ను అందుకున్నట్లు స్పష్టమవుతుంది . ఇక వారమే ఎన్టీఆర్ నటించిన 'వార్ -2', రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలు విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద "హరిహర వీరమల్లు" ముగిసినట్టే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications