OG రూ.6 కోట్ల వివాదం:దానయ్యతో సుజీత్‌కు గొడవా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ చిత్రంకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పలు రకాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. అయినా వీటన్నిటినీ దాటుకుని పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద కలెక్షన్లు సాధించిన సినిమాగా ఓజీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక పవర్ స్టార్ కనిపించగానే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలోనే ఓ తాజా రూమర్ ఫిలింనగర్‌ను చుట్టేసింది. ఇంతకీ ఆ గాసిప్ ఏంటి.. దానివల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది..?

సోషల్ మీడియాలో గాసిప్స్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్‌ రోల్‌లో నటించిన ఓజీ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒక చిన్న సినిమా విడుదలైతేనే పలు రకాల గాసిప్స్ సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్న ఈ రోజుల్లో... పవర్ స్టార్ నటించిన పవర్‌ఫుల్ సినిమాపై ఉండవా చెప్పండి. ఇందుకు ఓజీ కూడా ఏం మినహాయింపు కాదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీర మల్లుపై కూడా పలు రకాల ట్రోల్స్, గాసిప్స్‌తో సోషల్ మీడియా హీట్ ఎక్కిపోయింది. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ఇతర సినిమా హీరోల ఫ్యాన్స్ ఏకంగా ఇంటర్నెట్ పై మాటల యుద్ధానికే దిగారు. ఈ క్రమంలోనే ఓజీపై కూడా ఓ వార్త జోరుగా షికారు చేసింది. అయితే ఈ వార్తకు డైరెక్టర్ సుజీత్ స్పష్టత ఇస్తూ చెక్ పెట్టేశారు.

pawan-kalyans-og-director-sujeeth-breaks-silence-on-producer-danayya-cold-war-rumours

దానయ్య సుజీత్‌ల మధ్య విబేధాలు
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఓజీ సినిమా డైరెక్టర్ సుజీత్.. ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యల మధ్య కోల్డ్ వార్ నడిచిందంటూ వార్త జోరుగా షికారు చేసింది. అంతేకాదు ఓజీ చిత్రానికి గాను సుజీత్ తన సొంత డబ్బును రూ.6 కోట్ల వరకు ఖర్చు చేశారని కూడా గాసిప్పింగ్ జరిగింది. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని సోషల్ మీడియా వేదికగా కొన్ని రోజుల పాటు ప్రచారం జరిగింది. ఇక చివరిగా ఆ రూ.6 కోట్లతోనే సినిమాను కంప్లీట్ చేసినట్లు కూడా వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు ఇక దానయ్యతో కలిసి భవిష్యత్తులో ఎప్పుడూ పనిచేయనని సుజీత్ ప్రమాణం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.

వార్తలకు తెరదించిన సుజీత్
ఈ వార్తలన్నిటికీ డైరెక్టర్ సుజీత్ సమాధానం ఇచ్చారు. 2025 అక్టోబర్ 21వ తేదీన సుజీత్ ఒక లేఖ విడుదల చేశాడు. సినిమా చిత్రీకరణ సమయంలో దానయ్య తనకు ఎంతో మద్దతుగా నిలిచారని సుజీత్ కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తమిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే మాటను ఈ యంగ్ డైరెక్టర్ ఖండించారు. తాను ఏమి అడిగితే అది లేదనకుండా దానయ్య ముందుకు వచ్చి ఖర్చు పెట్టారని ఎక్కడా అడ్డు చెప్పలేదని సుజీత్ గుర్తుచేశాడు. దానయ్య లాంటి నిర్మాత వల్లే చిత్రం పెద్ద సక్సెస్ అయ్యిందని వెల్లడించాడు.

భారీ బడ్జెట్‌తో కూడిన సినిమాలు తీయడం సవాలుతో కూడుకున్న పని అని సుజీత్ చెప్పాడు.ప్రేక్షకులు అనుకున్నదాని కంటే కూడా చాలా బాగా రావాలనే అంచనాలతో సినిమాను తీస్తామని ఈ క్రమంలోనే బడ్జెట్ అనుకున్న దానికంటే అటూ ఇటూ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పిన సుజీత్.. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ దానయ్య తనకు అన్ని విధాలా సహకరిచాడని గుర్తుచేసుకున్నాడు. దానయ్యతో పాటు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేసిన పవన్ కల్ట్ ఫ్యాన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశారని కొనియాడాడు.

మొత్తానికి ఓ బహిరంగ లేఖ విడుదల చేసి ఓజీ డైరెక్టర్ సుజీత్ ఒక కాంట్రవర్శీకి తెరదించినట్లయ్యింది.ఈ చిత్రం వివాదాలతో హిట్ కాలేదని గుర్తు చేసిన సుజీత్... కేవలం ప్రేక్షకాదారణతోనే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతిపెద్ద కలెక్షన్స్‌తో బంపర్ హిట్‌గా నిలిచిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+