'OG' Twitter Review : పోతారు మొత్తం పోతారు..!

అనుకున్న సమయం రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' (OG) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షో చూడగానే అభిమానులు, సినీ ప్రేమికులు సోషల్ మీడియాలో తమ స్పందనను పంచుకుంటూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, సినిమాపై పాజిటివ్ బజ్ బలంగా వినిపిస్తోంది.

'ఓజీ'ని చూసిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ నటన, స్టైల్, మరియు దర్శకుడు సుజీత్ టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాలోని ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు, మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు goosebumps తెప్పిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ట్వీట్స్, పోస్టులు చూస్తే, 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద సంచలనం సృష్టించబోతోందని స్పష్టమవుతోంది.

Pawan Kalyan s OG First Day First Show Twitter Review

తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'ఓజీ' పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ఇదొక మాస్ సినిమా. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే చివరి 20 నిమిషాల సినిమా అభిమానులకు కిక్ ఇస్తుందని, సినిమాకు ఆ సీన్లే ప్రాణం పోశాయని ఉమైర్ సంధు తన ట్విట్‌లో చెప్పుకొచ్చాడు. అయితే ఇతను చెప్పిన రివ్యూలు చాలానే తప్పుగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఉమేర్ సంధూ సూపర్ హిట్ అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో ఉమేర్ సంధూ రివ్యూపై ఎవరూ నమ్మకాలు పెట్టుకోవద్దని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+