అమ్మ బాబోయ్.. పవన్ కళ్యాణ్ ఆ మూవీ రెమ్యూనరేషన్ 170 కోట్లా..?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో 'OG', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' ఉన్నాయి. ఎలక్షన్స్ లోపు ఆ సినిమాలు కంప్లీట్ కాకపోవడం.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో తలమునకలై ఉండటంతో .. ఆ మూవీస్ రిలీజ్ లేట్ అవుతూ వస్తుంది.
అయితే రీసెంట్ గానే 'OG', 'హరిహర వీరమల్లు' సినిమాలకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే మధ్యలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లో అగ్నిప్రమాదం జరగడంతో హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళడం.. రెండు రోజులు అక్కడే ఉండడం.. ఇండియాకి తిరిగి రావడం జరిగింది. దీంతో ఆ చిత్రాల షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే మళ్లీ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

ఇక ఈ రెండు సినిమాల సంగతి పక్కన పడితే గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మళ్లీ ఒక సినిమా అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కానీ మిగిలిన సినిమాల గురించి ఒక అప్డేట్ అయిన ఇస్తున్నారు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏ అప్డేట్ రావడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైత్రీ నిర్మాతలు సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని, ఈ ఏడాదిలోనే ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారని.. చెప్పుకొచ్చారు. సినిమా కచ్చితంగా 2026లో విడుదల అవుతుందని హామీ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించి మరో విషయం కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం ఏకంగా 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఏంటో తెలియాలంటే నిర్మాతలు క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఇక మరోవైపు మొత్తానికి రాజకీయాలతో పాటు సినిమాలు కూడా త్వరలో ఫినిష్ అయ్యి రిలీజ్ అవుతాయని పవన్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.












Click it and Unblock the Notifications