'OG' సినిమాకు అదే పెద్ద మైనస్
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గత కొంతకాలంగా ఎదురైన ప్రతికూలతలను చెరిపేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసిన చిత్రం ఓజీ. నేడు (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
పవన్ కళ్యాణ్ నటన, స్టైలిష్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన విధానం సగటు ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంది.

ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్ ఇంట్రోడక్షన్: పవన్ ఎంట్రీ సీన్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు, అభిమానులకు అది ఒక పెద్ద ట్రీట్.
హై మూమెంట్స్: ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక హై మూమెంట్ ఇచ్చి, ప్రేక్షకుడి మనసులో బలమైన ముద్ర వేసింది.
కీలక సన్నివేశాలు: ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు సినిమా మొత్తానికి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
దర్శకత్వం: సుజిత్ తీసుకున్న డిఫరెంట్ టేకింగ్ మరియు స్టైలిష్ మేకింగ్ సినిమాను నిలబెట్టింది.
మైనస్ పాయింట్స్:
కథనం డ్రాగ్: సినిమా కథను చాలా డ్రాగ్ చేసి చెప్పడం వల్ల, ముఖ్యంగా మొదటి భాగంలో చాలా సేపు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్ కలిగించవచ్చు.
సెకండాఫ్‌లో నిరాశ: ఇంటర్వెల్ తర్వాత హై మూమెంట్స్ సరిగ్గా పండకపోవడం, ముఖ్యంగా సెకండాఫ్ మొదలైన 20 నిమిషాల తర్వాత నిరాశ కలుగుతోంది.
పాత్రల వృథా: శ్రేయా రెడ్డి వంటి మంచి నటిని తీసుకున్నప్పటికీ, ఆమె పాత్రను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. ఆమెను మరింత లేడీ శివంగి తరహాలో చూపించి ఉంటే సినిమాపై ఇంపాక్ట్ మరింత పెరిగి ఉండేది.
ఏది ఏమైనప్పటికీ, ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్‌లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఈ సినిమా కలెక్షన్లపై మీ అంచనా ఏమిటి?












Click it and Unblock the Notifications