పవన్ కల్యాణ్ సినిమాకు టీ ఖర్చులు కూడా రాలేదే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారాయన. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినప్పటికీ ఆయనుకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఖుషీ సినిమాతో పవన్ కల్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా ఖుషీ సినిమా నిలిచింది. ఆ తర్వాత ఆయనకు పదేళ్ల పాటు హిట్ సినిమా లేదు. తిరిగి గబ్బర్ సింగ్ సినిమాతో ఆయన హిట్ కొట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ కెరీర్‌లో చాలా హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి.

ఈ మధ్య పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్ కల్యాణ్ నటించిని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. మధ్యలో కొన్ని యావరేజ్ సినిమాలు వచ్చినప్పటికీ, అవి పవన్ కల్యాణ్ క్రేజ్‌కు దగ్గ సినిమాలు కాలేకపోయాయి.
ఇటీవల వచ్చిన 'హరిహర వీరమల్లు' సినిమా సైతం దారుణంగా పరాజయం పాలైంది. తాజాగా పవన్ కల్యాణ్ పెద్ద హిట్ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన 'తమ్ముడు' సినిమాను రీ-రిలీజ్ చేశారు. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎనర్జీ, బాక్సింగ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాను రీ-రిలీజ్ అంచనాలను అందుకోలేకపోయింది. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన సెంటర్లలో కూడా టికెట్ సేల్స్ నిరాశపరిచాయి.
పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాను రీ-రిలీజ్ చేస్తే కనీస స్పందన కూడా కనిపించలేదు.రీ-రిలీజ్ ఖర్చులు రూ. 2 కోట్ల వరకు ఉండగా, కలెక్షన్స్ మాత్రం లక్షల్లోనే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications