Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ నయా రికార్డ్.. ముప్పై రోజుల గ్యాప్‌లో మూడు సినిమాలు రిలీజ్ !

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులు సహా పలు సందర్భాలను పురస్కరించుకొని సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండుగ చేసుకునే విషయం అని చెప్పాలి. వచ్చే 30 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అందులో రెండు క్లాసిక్ బ్లాక్‌బస్టర్ రీ రిలీజ్‌లు కాగా.. ఒకటి మాత్రం పాన్‌ఇండియా స్థాయిలో భారీ అంచనాలు పెంచుకున్న కొత్త సినిమా. దీంతో పవన్ అభిమానులకు వచ్చే నెలంతా పండుగ వాతావరణం నెలకొనబోతోంది.

pawan-kalyans-three-films-that-thammudu-jalsa-and-og-releasing-in-thirty-days-period

రీ రిలీజ్‌ల హంగామా..

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాత హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తమ్ముడు' సినిమాను రేపు ( ఆగస్టు 30, 2025 ) నుంచి గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ అభిమానులకు ఇది ఒక గోల్డెన్ మెమరీగా నిలిచే అవకాశం ఉంది.

అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సందర్భంగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ 'జల్సా' రీ రిలీజ్ అవుతోంది. అప్పట్లో రికార్డులను సృష్టించిన ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున వేడుకలకు సిద్ధమవుతున్నారు.

pawan-kalyans-three-films-that-thammudu-jalsa-and-og-releasing-in-thirty-days-period

'OG'తో పవర్‌ఫుల్ ఎంట్రీ..

మరోవైపు రీ రిలీజ్‌ల హంగామా మధ్యలో పవన్ కళ్యాణ్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ (OG)' సెప్టెంబర్ 25న పాన్‌ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కాగా సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్ లలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ రాగా.. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ మరింతగా క్రేజ్ పెంచింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, సెప్టెంబర్ 18 లేదా 19న ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఒకే నెలలో పవన్ సినిమాలు ఇలా వరుసగా థియేటర్లలో రాబోతుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. "తమ్ముడు - జల్సా - ఓజీ" కాంబినేషన్‌తో పవన్ ఫ్యాన్స్‌కి సరిగ్గా ఒక నెలపాటు ఫెస్టివల్ ఆఫ్ సినిమా జరగనుంది. రీ రిలీజ్‌లతో పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకోవడమే కాకుండా, కొత్త సినిమాలో పవన్ పవర్‌ను చూడటానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+