ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అటు థియేటర్లు అయినా ఓటీటీ అయినా రికార్డుల వేట జరుగుతూనే ఉంటుంది. గతేడాది ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించడంతో రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 2012 లో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఏ మేరకు సంచలనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే.
గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్న నేపథ్యంలో ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. దాంతో పవన్ కెరీర్ లో ప్లాఫ్ గా ఈ చిత్రం నిలిచింది.
ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే? pic.twitter.com/NXkMTehZ33
— V6 News (@V6News) March 26, 2026
అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. థియేటర్ లో మిస్ అయిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో పవన్ కల్యాణ్ ఓజీ మూవీ కూడా భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నిర్మాత నవీన్ యెర్నేని గతంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 5 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ తెలుగుతోపాటుగా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
-
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్‌లో ఫ్యాన్స్! -
మహేష్ బాబు " వారణాసి " స్టోరీ ఇదే.. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ పక్కా ? -
బెస్ట్ యాక్టర్‌గా మరో అవార్డ్ అందుకున్న అక్కినేని హీరో..! -
చిక్కుల్లో పడ్డ యంగ్ హీరో.. పార్టీలకు రావాలంటూ అమ్మాయిలకు మెసేజ్‌లు? -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
బిగ్ షాక్ : ప్రభాస్ "స్పిరిట్" షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం.. -
ఆ స్టార్ డైరెక్టర్ అందరి ముందు చీర విప్పి పడుకోమన్నాడు !! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..!












Click it and Unblock the Notifications