నేను అది అనుభవిస్తాను..హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వార్తల్లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. కాస్తా ఫేమస్ వస్తే చాలు దానిని నిలబెట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. తాజాగా ఇదే పనిలో నిమగ్నమైంది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవ్వోరో కాదు పాయల్ రాజ్ పుత్. తాను నటించిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. RX 100 సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన పాయల్.. తన తొలి సినిమాలోనే బొల్డ్‌గా నటించి అభిమానులకు షాకిచ్చింది.
గ్లామర్ చూపించడానికి తనకు ఎలాంటి హద్దుల్లేవని తొలి సినిమాతోనే పాయల్ నిరూపించింది. RX 100 సినిమాలో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది.అమ్మడు అందాలను చూడటానికి యూత్ ఎగబడ్డారు. ఈ సినిమా తరువాత పాయల్ రేంజ్ మారిపోయిద్దని అందరూ భావించారు. కట్ చేస్తే.. సరైన అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితికి చేరుకుంది. RX 100 దర్శకుడుతోనే మంగళవారం సినిమా చేసి కెరీర్‌లో మరో హిట్‌ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే పాయల్ ..తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది. ఓ హాట్ వీడియో షేర్ చేసిన ఆమె లవ్ గురించి హిట్ ఇచ్చింది. ''ప్రేమను మీరు ఎలా పలుకుతారు? నేను మాత్రం లవ్‌ను అనుభవిస్తాను'' అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారంతా పాయల్ ప్రేమలో పడిందని, అందుకే ఇలా హింట్ ఇస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications