డెవిల్ సినిమా మరో కేజీఎఫ్ కాంబినేషన్ అవుతుందా?, బాలీవుడ్ భాయ్ ఎంట్రీ ఇచ్చాడా?, సెట్ చేస్తే!
స్యాండిల్ వుడ్ చాలెంజింగ్ స్టార్ దర్శన్, బాలీవుడ్ భాయ్ సంజయ్ దత్ ఇటీవల కలుసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ తదుపరి చిత్రంలో దర్శన్ నటిస్తున్నారు. అదే సంస్థకు చెందిన మరో చిత్రంలో సంజు భాయ్ నటిస్తున్నారు. చాలెంజింగ్ స్టార్ దర్శన్, సంజూ భాయ్ కలిసి నటిస్తున్నారని డీ బాస్ అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.
డీ బాస్ దర్శన్ హీరో గా నటించిన కాటేరా సినిమా ఇటీవల విడుదల అయ్యి భారీ విజయం సాధించడంతో ఆ సినిమా యూనిట్ సభ్యులు, చాలెంజింగ్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హీరో దర్శన్ కూడా కాటేరా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. రూ. 200 కోట్లకు పైగా కాటేరా సినిమా వసూళ్లు చేసింది. హీరో దర్శన్ ఇప్పుడు డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. జోగి ఫేమ్ ప్రేమ్ డెవిల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు కేవీఎన్ ప్రోడక్షన్స్ సినిమా డెవిల్ సినిమాను నిర్మిస్తోంది.

కేవీఎన్ చిత్ర బృందంతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించాడు. కరియ సినిమాలో కలిసి పనిచేసి విజయం సాధించిన ప్రేమ్ మళ్లీ దర్శన్‌తో జోడీ కడుతున్నాడు. హీరో దర్శన్ సినీ జీవితాన్ని కరియా సినిమా మార్చేసింది మెగస్టార్ చిరంజీవికి ఖైదీ సినిమాలో ఎలా టర్నింగ్ పాయింట్ అయ్యిందో హీరో దర్శన్ కు కరియా సినిమా అంతే టర్నింగ్ పాయింట్ అయ్యింది. డెవిల్ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ్ దర్శకత్వం వహించిన కేడీ చిత్రంలో సంజయ్ దత్ నటించారు.

సంజయ్ దత్ ప్రస్తుతం కేడీ సినిమా షూటింగ్ కోసం బెంగళూరులో ఉన్నారు. కేడీ చిత్రాన్ని కూడా కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది. అయితే సంజయ్ దత్, దర్శన్ స్నేహపూర్వకంగా ఒక్కటయ్యారని తెలిసింది. దర్శన్, సంజయ్ దత్‌లను కలిసి చూసిన అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. కేజీఎఫ్-2 సినిమా ద్వారా సంజూ భాయ్ స్యాండిల్ వుడ్‌లోకి అడుగుపెట్టారు. దర్శన్ తదుపరి చిత్రంలో సంజూ భాయ్ నటిస్తున్నాడా? అనే సందేహం కొందరిని వెంటాడుతోంది. దర్శన్, సంజయ్ దత్ కలిసి నటిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో అని డీబాస్ అభిమానులు అప్పుడే ఊహించుకుంటున్నారు.
కొన్ని విభేదాల కారణంగా మళ్లీ దర్శన్‌తో సినిమా చేయనని గతంలో జోగి ఫేమ్ దర్శకుడు ప్రేమ్ బహిరంగంగా చెప్పాడు. అయితే ప్రేమ్ ప్రకటనతో ఆయన భార్య, ప్రముఖ నటి రక్షిత షాక్ అయ్యారని, తరువాత ఆమె రాజీ ప్రయత్నాలు చేశారని తెలిసింది. తర్వాత భర్త ప్రేమ్, హీరో దర్శన్ ల మధ్య రక్షితా ప్రేమ్ బేరసారాలు జరిపి ఇద్దరిని కలిసి సినిమా చేసేలాఒప్పించింది అని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే టైమ్ లో హీరో దర్శన్, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్ లో డెవిల్ సినిమా సెట్ మీదకు వచ్చింది. ప్రస్తుతం దర్శన్ డెవిల్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ప్రేమ్ దర్శకత్వం వహించే డెవిల్ నిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ సంస్థ డెవిల్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. గత సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా జోగి ప్రేమ్ సినిమాలంటే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్ల తరువాత దర్శన్ తో ప్రేమ్ డెవిల్ అనే సినిమాను ఏస్థాయిలో చేస్తాడో అని డీ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications