నాగ చైతన్య జ్ఞాపకాల్లోనే సమంత..ఆ పోస్ట్‌తో అంతా షాక్..!
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు. నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితతో గురువారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్ధ కార్యక్రమం జరిగింది.

నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత అభిమానులు నాగ చైతన్యపై మండిపడుతున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్ సైతం నాగ చైతన్య రెండో పెళ్లిపై పరోక్షంగా స్పందించాడు. పతిత కంగ్రాట్స్ అంటూ ఓ స్టోరీ పెట్టగా, రహస్యాలు మరియు అబద్ధాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంబంధాన్ని చంపేస్తారు, మీరు చిక్కుకుంటారంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
అయితే నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్‌లో నాగ చైతన్యతో ఫొటోలు ఇప్పటికి అలాగే దర్శనం ఇచ్చాయి. సమంత , నాగ చైతన్య విడిపోయి చాలా ఏళ్లు అవుతోంది.అయినప్పటికి వీరి పెళ్లి ఫొటోలు సమంత అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్‌లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇంకా నాగ చైతన్య జ్ఞాపకాల్లోనే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications