విజయ్ దేవరకొండ - రష్మిక రిసెప్షన్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం ఈ జంట సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. విజయ్ తెలుగు సంప్రదాయాలను, రష్మిక కూర్గ్‌లోని కొడవ వలస వారసత్వాన్ని కలిపి.. ఈ వివాహాన్ని రెండు విభిన్న సాంస్కృతిక గుర్తింపుల అందమైన సమ్మేళనంగా జరుపుకున్నట్టు తెలుస్తోంది.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్‌లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. కాగా ఉదయ్‌పూర్‌లో కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే పెళ్లి జరగగా, హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ,వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు.

pm-modi-may-attend-as-chief-guest-for-vijay-devarakonda-and-rashmika-mandanna-reception-at-hyderabad

ఇక విజయ్, రష్మికలు ప్రధాని మోదీని కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను ప్రధాని ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ఇప్పుడు భాగ్యనగరంలో సందడి మొదలైంది.

ఈ పెళ్లిలో విజయ్-రష్మికలు ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రాయల్ వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ Anamika Khanna రూపొందించినట్లు సమాచారం. సంప్రదాయాన్ని ఆధునిక స్టైల్‌తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ డిజైన్స్ జంట అందాన్ని మరింత రెట్టింపు చేశాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వివాహంలో జంట ధరించిన నగలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జువెలరీ సంస్థ దాదాపు 10 నెలల పాటు శ్రమించి ఈ నగలను రూపొందించినట్లు సమాచారం. రష్మిక ధరించిన వడ్డాణం, మంగళసూత్రం, హారం, గాజులు సహా మొత్తం 11 రకాల నగల బరువు సుమారు 1.5-2 కేజీలు ఉండగా, వాటి విలువ రూ.3-5 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం. మరోవైపు విజయ్ ధరించిన అరకేజీ బరువైన నగల విలువ రూ.1-2 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+