జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు..?
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.అయితే తనకు ఉత్తమ జాతీయ అవార్డు వచ్చిందని, ఆ కార్యక్రమానికి హాజరుకావాలని బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, అలాగే మరోసారి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది.

జాతీయ అవార్డుల కమిటీ జానీ మాస్టర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్‌కు కేటాయించిన ఉత్తమ జాతీయ అవార్డును రద్దు చేస్తోన్నట్టు కమిటీ ప్రకటించింది. ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో జానీ మాస్టర్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. అయితే అవార్డు రద్దు కావడంతో దీని ప్రభావం ఆయన బెయిల్ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండుకు తరలించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications