లిఫ్ట్‌లో అలా దొరికిపోయిన పూజా హెగ్డె
హీరోయిన్ పూజా హెగ్దే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది. వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.

పైగా గురుజీ సైతం 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది. విజయ్ ,సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'దేవా' సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన హవాను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది. బ్యాక్ టు బ్లాక్ అనే క్యాప్షన్ ఇచ్చిన కొన్ని ఫొటోలను ఆప్‌లోడ్ చేసింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ షూట్‌లో బ్లాక్ కలర్స్ గాగుల్స్ పెట్టుకుని లిఫ్ట్‌లో స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది.బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్ అంటూ పూజా హెగ్దే ఫొటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications