స్టార్ క్రికెటర్ ను పెళ్లాడబోతున్న పూజా హెగ్డే?
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ఒక లైలా కోసం చిత్రంతో పూజా హెగ్డే తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. హిట్ ను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించింది. అయితే అది హిట్ కాకపోవడంతో అమ్మడుకు నిరాశ తప్పలేదు.
దువ్వాడ జగన్నాథం సినిమాతో మరోసారి టాలీవుడ్ లోకి ప్రవేశించిన పూజ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు కాలం కలిసిరావడంలేదు. బీస్ట్, రాధేశ్యామ్, కిసీకా భాయ్ కిసీకీ జాన్ లాంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లయ్యాయి. దీంతో నిర్మాతలు అమ్మడువంక చూడాలంటే భయపడుతున్నారు. గుంటూరు కారం సినిమాలో కూడా పూజా హెగ్డేనే కథానాయికగా ఎంపిక చేశారు. అయితే అకస్మాత్తుగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.

వరుసగా హిట్లు కొడుతూ ముందుకు సాగగా.. ప్రస్తుతం వరుసగా ఫ్లాపులు కొడుతోంది. అయినా తన క్రేజ్ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది. పూజా హెగ్డే అంటే పడిచచ్చే యువతకు ఒక ఫ్లాష్ న్యూస్. త్వరలోనే ఆమె ఏడడుగులు వేయబోతోంది. ప్రముఖ క్రికెటర్ తో కొంతకాలం నుంచి ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు సుమా ముంబయిలోని ఓ ప్రయివేటు పార్టీకి ఇద్దరూ కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వడంలేదు. ఈ విషయాన్ని బుట్టబొమ్మ అందరితో ఎప్పుడు పంచుకుంటుందో అప్పుడే ఉత్కంఠ తగ్గనుంది.












Click it and Unblock the Notifications