త్రివిక్రమ్ నా జీవితాన్ని నాశనం చేశాడు..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తొలుత సినిమాల్లో నటించిన ఈ భామ, ఆ తర్వాత తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది.
No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
అయితే హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అనేకమార్లు పోస్టులు పెట్టడం జరిగింది.'నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్పతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి' అంటూ గతం పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్‌పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై మరోసారి ఆమె ట్వీట్ చేశారు. నేను మా అసోసియేషన్‌లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతడ్ని ప్రశ్నించలేదని , యాక్షన్ తీసుకోలేదని.. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతడ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు.నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడు అంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది.నువ్వు ఎవరన్నది కాదు.. నువ్వు ఏం చేశావ్ అన్నదే ముఖ్యం మరో ట్వీట్ చేసింది. పూనమ్ కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ , త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పన్స్ రావడం లేదు.












Click it and Unblock the Notifications