త్రివిక్రమ్‌పై రెచ్చిపోయిన పూనమ్ కౌర్.. మొత్తం ఆయన వల్లే
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తొలుత సినిమాల్లో నటించిన ఈ భామ, ఆ తర్వాత తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది.
Used to work - everything stopped due to trivikram and groups torture .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 26, 2025
అయితే హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కస్సును వెళ్లగక్కుతుంటుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ అనేకమార్లు పోస్టులు పెట్టడం జరిగింది.'నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోలా గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్పతున్నావు. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి' అంటూ గతం పూనమ్ కౌర్ చెప్పుకొచ్చింది.

పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్‌పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.నేను మా అసోసియేషన్‌లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతడ్ని ప్రశ్నించలేదని , యాక్షన్ తీసుకోలేదని.. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతడ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు.నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది.తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై ఆమె ట్వీట్ చేసింది. పని చేసేవారిని - త్రివిక్రమ్ మరియు గ్రూపుల హింస కారణంగా ప్రతిదీ ఆగిపోయిందంటూ పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. పూనమ్ కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ , త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పన్స్ రావడం లేదు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications