బిగ్‌బాస్ ఊపిరి పీల్చుకో..హౌస్‌లోకి బోల్డ్ బ్యూటీ ఎంట్రీ
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభం అయింది. ఈసారి ప్రోమోలతోనే అదరగొట్టిన బిగ్‌బాస్ , దానికి మించిన కంటెంట్‌తో ఆకట్టుకుంటారని అంతా భావించారు.అయితే ఈ సీజన్‌లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యామమాన్యంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. సినీ జనాలకు సైతం తెలియని కంటెస్టెంట్లు రావడంతో ఈసారి బిగ్‌బాస్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కంటెస్టెంట్లు సైతం మొదటివారంలో పెద్దగా ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్‌ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి.అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా అనిపించాయి.
వంట దగ్గర నుంచి హోస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్ రూమ్స్ నీట్‌గా లేకపోవడం అంశాలపై హౌస్‌మెట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక బెజవాడ బేబక్క బిగ్‌బాస్ అభిమానులను తీవ్ర నిరాశ పరిచి, మొదటివారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.హౌస్‌లో ఆమె ఓవర్ యాక్షన్ చేసిందని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఆమె తొలివారం ఎలిమినేషన్ అయ్యారు. ఇదిలా ఉంటే హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మొదట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ రీతూ చౌదరి పేరు వినిపించినప్పటికి, తర్వాత రితూ చౌదరిని కాకుండా మరో హాట్ భామను హౌస్‌లోకి తీసుకురావడానికి బిగ్‌బాస్ యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

బుల్లితెర పాపులర్ నటి జ్యోతి రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ స్టార్టింగ్‌లోనే బిగ్‌బాస్ టీమ్ ఆమెను సంప్రదించారని కానీ షూటింగ్స్ వల్ల వేల్లలేకపోతున్నానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు వాళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీకి చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జ్యోతిరాయ్ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతుండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, జ్యోతి రాయ్ బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇందులో సంప్రదాయ లుక్‌లో కనిపించే జ్యోతి రాయ్ ..సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ పిక్స్ షేర్ చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుంటోంది. మరి ఈ బ్యూటీ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications