పవన్ కల్యాణ్ - శంకర్ దర్శకత్వంలో మిస్సయిన బ్లాక్‌బస్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎట్టకేలకు 'పవర్' సాధించారు. పిఠాపురం నుంచి 70వేల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అంతేకాదు.. తనతోపాటు పోటీచేసిన మరో 20 మంది అభ్యర్థులను కూడా గెలిపించుకున్నారు. పోటీచేసిన మొత్తం 21 నియోజకవర్గాల్లోను ఆ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడమేకాదు.. దేశం మొత్తం తమవైపు చూసేలా చేసుకున్నారు. ప్రజలకు సేవచేయాలని పరితపించే పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన కోరికను నెరవేర్చుకోవడమేకాదు.. ఉప ముఖ్యమంత్రిగా ఆ దిశలోనే పయనిస్తున్నారు.
ఆచరించి చూపితే చాలు
సినిమాల్లో పవర్ స్టార్ గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో దక్షిణాదిలో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ సినిమాలో చేసే అవకాశం వచ్చిందికానీ వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం కార్యరూపం దాల్చలేదు. శంకర్ అన్నాహజారే స్ఫూర్తితో నిజాయితీ కలిగిన, అవినీతిని నిర్మూలించే వ్యక్తి కథను తయారుచేసుకొని పవన్ కల్యాణ్ తో చేస్తే బాగుంటుందని భావించారు. అయితే ఆ సినిమా చేయడానికి పవన్ నిరాకరించారు. వాస్తవానికి నిజాయితీగా ఉండాలని, అవినీతిని నిర్మూలించాలి అనే విషయాన్ని తాను సినిమాల్లో చెప్పడంకన్నా నిజ జీవితంలో ఆచరించి చూపడానికే పవన్ ఆసక్తి చూపించేవారు.

నిజ జీవితంలో పోరాడితే చాలు
నిజజీవితంలో తాను అవినీతి, అక్రమాలమీదే పోరాడుతున్నాను కాబట్టి దీన్ని ప్రత్యేకంగా సినిమాలద్వారా చెప్పడం అనవసరమని ఆయన భావించారు. ఒకవేళ ఈ అంశాలను సినిమాగా తీయాలనుకున్నా దానికి తాను స్వయంగా దర్శకత్వం వహించడమే మంచిది అని, ఇటువంటి అంశాలను సినిమాలద్వారా చెబితే ప్రేక్షకులు కూడా పవన్ చాలా ఓవర్ చేస్తున్నాడురా.. అని అనుకుంటారనేది పవన్ ఆలోచన. అందుకే ఇటువంటివి చేయకుండా కేవలం ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా సినిమాలు చేస్తే చాలు అనుకున్నారు. అందుకే శంకర్ కు చేయనని చెప్పేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యుండేదని అభిమానులు అంటున్నారు. సామాజిక అంశాలను తన సినిమాలో చాలా శక్తివంతంగా చెప్పడంలో దర్శకుడు శంకర్ చాలా దిట్ట. అయితే భారతీయుడు2 ద్వారా ఘోరమైన డిజాస్టర్ ను మూటకట్టుకొని తన కెరీర్ లోనే ఆ సినిమాను మాయని మచ్చగా చేసుకున్నారు.












Click it and Unblock the Notifications