Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాత్రి అయితే పవన్ కల్యాణ్ అలాంటి సినిమాలే చూస్తారు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమానుల బలం ఎక్కువ. ఆయన నుంచి సినిమా విడుదలవుతోంది అంటే చాలు.. థియేటర్లు దద్ధరిల్లిపోవాల్సిందే. ప్రస్తుతం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో బిజీగా ఉన్నారు. తాను కూడా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. కచ్చితంగా గెలుపొంది అసెంబ్లీలో అడగు పెట్టాలనే కృతనిశ్చయంతో పవన్ ఉన్నారు. పవన్ తరఫున సినీ పరిశ్రమకు చెందినవారు కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తూనే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కూడా పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ర్యాపిడ్ ఫెయిర్ సెషన్‌లో భాగంగా మీకు ఇష్టమైన సాంగ్ ఏది అని యాంకర్ పవన్ కల్యాణ్ ను అడగ్గా ఆయన వెంటనే హిందీలో ఎంతో ఫేమస్ అయిన ఏ రాతే ఏ మౌసమ్ అనే పాట అని సమాధానమిచ్చారు. రాత్రి సమయంలో ఎటువంటి సినిమాలు చూడటానికి ఆసక్తి కనపరుస్తారు అని అడగ్గా హర్రర్ సినిమాలు చూస్తానని చెప్పారు. ఆ సినిమాలు చూసే సమయంలో తన మైండ్ మొత్తం దానిమీదే కేంద్రీకృతమవుతుందని, మైండ్ అంతా సైలెంట్ అయి తనకు కాస్త ప్రశాంతత దొరుకుతుందని చెప్పారు.

power star pawan kalyan likes horror movies

నిజ జీవితంలో కనిపించే డెవిల్స్ కంటే హర్రర్ సినిమాల్లో కనిపించే డెవిల్స్ ను చూడటానికే తాను ఎక్కువ ఇష్టపడతానని పవన్ చెప్పారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కు ఇష్టమైన పాట తన కూతురు ఆద్యా ఓ వేదికపై పాడటంతో తండ్రీ కూతురికి ఒకే పాట ఇష్టమా.. క్యూట్ ఫాదర్ అండ్ క్యూట్ డాటర్ అంటూ మెగా పవర్ స్టార్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం రాత్రివేళ దెయ్యం సినిమాలు చూడటం ఏమిటి? పవన్ కల్యాణ్ కు ఇదేం అలవాటంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ట్రోలింగ్ చేసేవారికి, మెగా అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+