రిలీజ్ కు ముందే 'హరిహర వీరమల్లు' సంచలన రికార్డు.. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం. ఆయన సినిమా కోసం కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. పవన్ కల్యాణ్ మూవీస్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా మెగా ఫ్యాన్స్ కు పండగే. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఓ పక్క ఓజీ, మరో పక్క హరిహర వీర మల్లు చిత్రాలు షూటింగ్ జరుపుకొంటున్నాయి. మరోపక్క పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో రాష్ట్రాభివృద్దిలో బిజీగా ఉన్నారు.
అయితే పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' ఇందులో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. అయితే దీనిని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఏ ఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుంది.

అయితే రిలీజ్ కు ముందే 'హరిహర వీరమల్లు' సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు 11 సార్లు వాయిదా పడి తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం. ఈ మూవీని మే 30 న కానీ జూన్ మొటటివారంలో గానీ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అతి త్వరలో దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఇన్ని సార్లు వాయిదా పడటం ఇదే తొలిసారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక దీన్ని చూసిన మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటే మినిమమ్ ఉంటది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి మే 30న అయినా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా అయోమయంగానే ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళనలలో ఉన్నారు. వీళ్ల కంటే ఎక్కువ టెన్షన్ 'హరిహర వీరమల్లు'నిర్మాతల్లో ఉంది. సినిమా రిలీజైతేనే పెట్టిన డబ్బు వస్తుంది కాబట్టి.. ఎలాగైనా చిత్రాన్ని విడుదల చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. రిజల్ట్ తో పని లేకుండా చిత్రాన్ని విడుదల చేసి టెన్షన్ నుంచి బయట పడాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఓజీ ఫస్ట్ సాంగ్ రిలీజ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ'. ఈ సినిమాపైనా రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ మినహా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే తాజాగా దీనిపై ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని.. మిగతా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని.. పవన్ కల్యాణ్ సెట్స్ కు వచ్చిన రోజు గిఫ్ట్ గా.. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications