ప్రభాస్ - త్రిషను కలపడానికి ప్రయత్నిస్తున్న దర్శకుడు.. చర్చలు పూర్తి?
ప్రభాస్-త్రిష జంట వెండితెరపై వెలుగులీనింది. వీరిద్దరినీ చూసి సినీ ప్రియులంతా మైమరిచిపోయేవారు. వివాహం కూడా జరుగుతుందేమోనని అనుకున్నారుకానీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రభాస్-త్రిష ప్రేమించుకున్నారని, కాకపోతే నిజ జీవితంలో కాస్తంత స్వేచ్ఛ కావాలని త్రిష అనుకోవడం.. తమిళంలో ఓ స్టార్ హీరోతో సఖ్యతగా మెసలుకోవడంలాంటివన్నీ ప్రభాస్ మనసును నొప్పించాయి. అంత స్వేచ్ఛ ఉన్న అమ్మాయి తన జీవితానికి సరికాదేమోనని ప్రభాస్ భావించడంతో వారి నిశ్చితార్థానికి కొన్న ఖరీదైన ఉంగరం కూడా డార్లింగ్ దగ్గర అలాగే ఉండిపోయింది.
జనవరిలో మొదలుకాబోతున్న షూటింగ్
వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో వీరిద్దరూ నటించారు. ఆ తర్వాత వీరితో సినిమాలు చేయాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష ఇప్పుడు కూడా కొత్తగా వస్తున్న హీరోయిన్లకు ధీటుగా అగ్ర కథానాయికగా రాణిస్తుండటంపై ప్రశంసలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఓ దర్శకుడు మాత్రం వీరిద్దరితో సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కథకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

హుందాతనం ఉట్టిపడే పాత్రలో
నిజాయితీ పరుడైన పోలీసు అధికారిగా ప్రభాస్ నటించబోతున్నారు. తన కెరీర్ లో మొదటిసారిగా పోలీసు పాత్ర పోషిస్తున్నారు. కథలో భాగంగా హీరోకు ఓ భార్య ఉంటుంది. పాత్ర ప్రకారం ఆమె ఎంతో హుందాతనంగా నటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ కు అంతేస్థాయి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఎంపిక చేయడం దర్శకులకు కష్టంగా మారుతోంది. సందీప్ మాత్రం ఈ పాత్రలో త్రిషను నటింపచేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రభాస్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా పూర్తవడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని భావిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా ఎంపికైతే మరోసారి వీరిద్దరి జంటను తెరపై చూడొచ్చని సినీ ప్రియులు ఆశపడుతున్నారు.
-
పెళ్లయ్యాక తొలి బర్త్డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్ -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్డ్రాప్లో విధ్వంసం -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !!












Click it and Unblock the Notifications